బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఎన్నాళ్లుగానో ఓ బ్లాక్‌బస్టర్ కోసం ఎదురుచూస్తున్నాడు. కానీ “రాధే”, “కిసీ కా భాయ్ కిసీ కి జాన్” ప్లాప్‌లు తర్వాత, “ఇదే నా కం బ్యాక్”! అన్నట్లుగా తెరపైకి వచ్చిన ‘సికందర్’ కూడా చివరికి అదే దారిలో నడిచింది. అభిమానుల ఆశల్ని పూడ్చేసిన ఈ చిత్రం థియేటర్లలో ఈద్ కానుకగా విడుదలై పరాజయం పాలైంది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటిటిలో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

దక్షిణాది డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సల్మాన్ ఖాన్ – రష్మిక మందన్నా కాంబినేషన్ మూవీ ‘సికందర్’ ఓటిటి డేట్ ను ఫిక్స్ చేసుకుంది. థియేటర్లలో భారీ హైప్‌తో విడుదలైన ఈ చిత్రం కథా కథనాలు, ట్రీట్‌మెంట్ లో బలహీనంగా ఉండటంతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అయినా, ఓటిటిలో మాత్రం దాన్ని చూసేందుకు ఆసక్తిగా ఉన్నవారు ఉన్నారు.

ఈ చిత్రానికి ఓటిటి హక్కులు నెట్‌ఫ్లిక్స్ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాను మే 25 (ఆదివారం) నుండి స్ట్రీమింగ్‌కి తీసుకురానుంది. అంటే థియేటర్లలో మిస్ చేసినవారు ఓటిటిలో చూసే అవకాశముంది.

ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా, సాజిద్ నడియాద్వాలా నిర్మాణం వహించారు. ఫ్యాన్స్‌కి ఒక్కటే ఆశ – “తక్కువ అంచనాలతో చూస్తే బాగుంటుందేమో!”

, ,
You may also like
Latest Posts from