బాలకృష్ణ అంటే మాస్ క్రేజ్‌కి మించిన ఒక ఫీస్ట్. వయస్సు పెరిగినా, ఎనర్జీ తగ్గలేదు. అఖండంగా, తాండవంగా స్క్రీన్ మీద ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ హృదయాల్ని ఊపేస్తూనే ఉన్నాడు. కానీ ఇప్పుడు బాలయ్య మరో కోణంలో మెరవనున్నాడట! అది కూడా యూత్ సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్‌లో!
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో 2018లో వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది’ ఓ వెరైటీ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్. ఓటీటీలో ట్రెండ్ సెట్ చేయడమే కాదు, రీసెంటుగా రీరిలీజ్‌లోనూ ఊహించని హిట్ టాక్ కొట్టింది. అందుకే దానికి సీక్వెల్ తీసే ఆలోచన బలపడింది. అదే పేరులో ఒక మజిలీగా – ‘ENE Repeat’ అంటూ తరుణ్ ఇటీవలే ప్రకటించాడు.
ఈసారి మేజర్ సర్ప్రైజ్ ఏంటంటే… ఈ సినిమాలో బాలకృష్ణ అతిథి పాత్రలో కనిపించనున్నాడన్న టాక్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది! విశ్వక్ సేన్‌తో బాలయ్యకు ఉన్న అనుబంధం తెలిసినవారికీ ఇది పెద్ద షాక్ కాదు. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సెట్స్‌కి బాలయ్య వచ్చి విశ్వక్‌కు సర్‌ప్రైజ్ ఇవ్వడం అప్పట్లో వైరల్ అయ్యింది.
ఇప్పుడు ఆ బాండింగ్ ‘ఈ నగరానికి ఏమైంది – సీక్వెల్’ వరకు వచ్చిందని అభిమానులు ఖచ్చితంగా నమ్ముతున్నారు. ఇంకా అధికారిక ప్రకటన రాలేదిగానీ, అటు బాలయ్య బిజీ షెడ్యూల్ చూస్తే, ఇటు తరుణ్ భాస్కర్ క్రియేటివ్ విజన్ చూస్తే – ఇది నిజమైతే ఓ మిలెస్ట్ోన్ అవుతుంది.
ఇక బాలకృష్ణ ప్రస్తుతం ‘అఖండ 2: తాండవం’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా రిలీజ్‌కి సిద్ధమవుతున్న ఈ సినిమాను సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నారు. కథానాయిక సంయుక్త. ఇటీవలే జార్జియాలో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారట.
అయితే ఇదే సమయంలో బాలయ్య యూత్ సినిమాల్లో అతిథిగా కనిపిస్తే… అది కుర్రాళ్లపై ఆయనకు ఉన్న ప్రేమ, ఎనర్జీకి ఓ నిదర్శనమే అవుతుంది. ఎందుకంటే – బాలయ్య ఎప్పటికీ కుర్రాడే!