ఇప్పుడు స్కూల్/కళాశాల బోర్డులపై ఫ్రెంచ్ రివల్యూషన్ మాత్రమే కాకుండా, మమ్ముట్టి జీవితం కూడా ఓ కథనమే! ఎందుకంటే ఆయన క్రేజ్ అలాంటిది! ఏడు పదుల వయస్సులోనూ సూపర్‌హిట్ సినిమాలతో ప్రేక్షకుల్ని అబ్బురపరుస్తున్న మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పేరు ఇప్పుడు విద్యార్థుల పుస్తకాల్లో కూడా మెరవనుంది.
సుమారు ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానంలో అనేక అద్భుతమైన పాత్రల్ని పోషించి, ఇండియన్ సినిమా గొప్పదనాన్ని ప్రపంచానికి చూపించిన మమ్ముట్టి… ఇప్పుడు విద్యార్థులకూ స్ఫూర్తిగా మారారు. కేరళలోని మహారాజ కళాశాల ఆయన సేవలను గౌరవిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది — బీఏ హిస్టరీ కోర్సులో ‘హిస్టరీ ఆఫ్ మలయాళం సినిమా’ అనే ప్రత్యేక అధ్యాయాన్ని ప్రవేశపెట్టింది.
ఈ అధ్యాయంలో మమ్ముట్టి సినీ ప్రస్థానం, ఎదుర్కొన్న సవాళ్లు, ఆయన సొంతంగా ఏర్పరుచుకున్న స్థానం, పొందిన పురస్కారాలు అన్నీ చర్చించబడ్డాయి. అంతేకాదు, మోహన్‌లాల్, జయన్, షీలా, ప్రేమ్ నాజీర్ వంటి మలయాళ సినీ దిగ్గజాల గురించి కూడా వివరాలు ఉన్నాయి.
ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే… మమ్ముట్టి స్వయంగా ఈ మహారాజ కళాశాల పూర్వ విద్యార్థి!
తన పూర్వ కళాశాల తన జీవితాన్నే పాఠ్యాంశంగా తీసుకోవడం అంటే… ఓ నటుడికి లభించే అత్యున్నత గౌరవాల్లో ఒకటే!
సినిమా నటుడిగా మమ్ముట్టి… ఇప్పుడు చరిత్రలో ఓ అధ్యాయంగా నిలిచారు!