పవన్ కళ్యాణ్ – ప్రకాష్ రాజ్ మధ్య మరోసారి మాటల తూటాలు పేలాయి. గతంలోనూ కొన్నిసార్లు సోషల్ మీడియాలో ఢీకొన్న ఈ ఇద్దరి మధ్య తాజాగా హిందీ భాష వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెరతీశాయి. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, పవన్ కళ్యాణ్‌పై ఘాటు వ్యాఖ్యలతో మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. “ఈ రేంజ్‌కి అమ్ముకోవడమా? ఛీ ఛీ…!” అంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
అసలేం జరిగింది?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గచ్చిబౌలిలో జరిగిన రాజ్య భాషా గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొని, హిందీ భాషపై సానుకూల వ్యాఖ్యలు చేశారు.
“మాతృభాష అమ్మ అయితే, హిందీ పెద్దమ్మ. హిందీ మనది కాబట్టి దాన్ని ప్రేమిద్దాం. ఇది మన బలాన్ని పెంచే మార్గం.”
అని పవన్ కళ్యాణ్ అన్నారు.
ఈ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగానే… ప్రకాష్ రాజ్ స్పందన ఓ షాక్‌లా మారింది.
ప్రకాష్ రాజ్ ఘాటు కౌంటర్
తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా పవన్ వ్యాఖ్యల వీడియోని షేర్ చేసిన ప్రకాష్ రాజ్ –
“ఈ రేంజ్‌కి అమ్ముకోవడమా? ఛీ ఛీ… #JustAsking”
అంటూ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు తీవ్రంగా, దూషణలా ఉండటంతో… ఇది వెంటనే జనసైనికుల ఆగ్రహానికి దారి తీసింది.
నెటిజన్ల నుంచి ప్రకాష్ రాజ్‌కి రిప్లై టార్నడో!
ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై జనసేన శ్రేణులు, అభిమానులు భగ్గుమన్నారు.
“మీరు అన్నట్టు భాషల్ని ద్వేషించేవాళ్లైతే, మీరు ఇన్ని భాషల్లో సినిమాలు చేసి, ఈ స్థాయి పేరు, డబ్బు సంపాదించగలిగే వాడివేనా?”
“ఇంగ్లీష్ నేర్చుకున్నాం కదా! హిందీని ఎందుకు కాదు? మీరు కూడా హిందీ సినిమాలో నటించారా కాదు?”
అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ మాటల వెనుక అర్థం ఏమిటి?
పవన్ మాటల్లో ఉద్దేశం… హిందీని ప్రతిభాషలా చూసి ద్వేషించొద్దన్నదే.
“భవిష్యత్తులో విద్య, ఉద్యోగం, వ్యాపారం కోసం భాషలు చాలా అవసరం. హిందీని నేర్చుకోవాలంటే అది బలవంతం కాదు. మన అభివృద్ధికి అది ఒక మాధ్యమం” అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఏదైమైనా
పవన్ వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశాన్ని పక్కనపెట్టి ప్రకాశ్ రాజ్ తీవ్రంగా విమర్శించడంతో ఈ వివాదం మరోసారి వివాదంలోకి ఎక్కింది. ఇద్దరి మధ్య ఈ ట్వీట్ వార్ ఎక్కడ ఆగుతుందో? లేదంటే ఇంకెంత వేడి పెరుగుతుందో? చూడాలి!