ఇప్పట్లో పెద్ద సినిమా అంటే సగం మంత్రం గ్రాఫిక్స్‌లోనే ఉంటుంది. హీరో ఒక ఎత్తైన భవనం మీద నుంచి దూకినా, క్షణాల్లో ఎడారి నుంచి హిమాలయాలకు వెళ్లినా, సముద్రంలో సమరసింహుడిలా పోరాడినా – అది అంతా గ్రీన్ స్క్రీన్ మ్యాజిక్! కానీ… ఈ కలల మాయ వెనక పెద్ద గేమ్ నడుస్తోందని ఒక స్టార్ ప్రొడ్యూసర్ బాంబ్ పేల్చాడు!
“టాలీవుడ్‌లో గ్రాఫిక్స్ కంపెనీలదే మరో పెద్ద మాఫియా!” అంటూ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కౌంటర్ వేశాడు.
తన మాటల్లో – సినిమా రిలీజ్‌కి కేవలం కొన్ని రోజులు ముందు మాత్రమే ఫైనల్ గ్రాఫిక్స్ ఫైళ్లను ఇస్తారు. మళ్ళీ కరెక్షన్లు అడగలేని స్థితి తీసుకొస్తారు. ఇలా టైమ్ ప్రెషర్‌లో ప్రొడ్యూసర్ ఎలాగైనా ఓకే చెయ్యాల్సిందే! పవన్ సినిమా ‘బ్రో’ కి అయితే… ఆఖరి నిమిషంలో ఫైళ్లు వచ్చి, తన సొంత కంపెనీ వాళ్లతోనే ఫైనల్ టచ్ పెట్టించుకోవాల్సి వచ్చింది. అదీ కాక డబ్బు రెండుసార్లు ఖర్చయిందట – ఒకసారి వాళ్లకీ, ఇంకోసారి తన సిబ్బందికీ! ‘మిరాయి’ విషయంలో మాత్రం విశ్వప్రసాద్ క్లారిటీ ఇచ్చాడు – “మా కంపెనీలే పూర్తిగా చేస్తున్నాం, బయట ఎవరికీ ఇవ్వలేదు” అని.
‘రాజాసాబ్’ కోసం 60% బయట కంపెనీలు, 40% తమ సొంత టీమ్ చేసినట్లు కూడా చెప్పారు.
టాలీవుడ్‌లో డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ మాఫియా తర్వాత ఇప్పుడు “గ్రాఫిక్స్ మాఫియా” కూడా హాట్ టాపిక్ అయిపోతోంది!
మరి ఈ మాయ వెనక ఎవరు? ఎప్పుడు బహిర్గతమవుతారు?