KGF సినిమా తెలుగుతో పాటు దేశవ్యాప్తంగా కన్నడ సినిమాలపై చూసే చూపును పూర్తిగా మార్చి వేసింది. అంతేకాదు రికార్డు స్థాయి బాక్సాఫీస్ కలెక్షన్స్‌తో ఇండస్ట్రీకు ఒక పెద్ద పేరు తెచ్చింది. అలాగే ఈ సినిమా సీక్వెల్‌తో కన్నడ సినిమాలకు మరింత గౌరవం పెరిగింది. దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యశ్‌ లకు దేశవ్యాప్తంగా అభిమానాలు, ప్రశంసలు వచ్చాయి.

ఇక్కడో మీకో ఆశ్చర్యపోయే విషయం.

KGF లో హీరో పాత్ర మొదట ఓ సీనియర్ స్టార్‌ దగ్గరకు వెళ్లింది. కానీ స్టార్ కన్నడ సినిమాలు పెద్దగా ఆడటం లేదు. దాంతో ఇంత బడ్జెట్ తో నాతో సినిమా ఎందుకు అని తిరస్కరించాడు అని హొంబాలే ఫిలింస్ కో-ప్రొడ్యూసర్ చలువే గౌడ వెల్లడించారు. ఆ సమయంలో కేవలం కిచ్చా సుదీప్, పూనీత్ రాజ్ కుమార్, శివరాజ్ కుమార్‌లే స్టార్స్ గా వెలుగుతున్నారు అన్నారు. అంటే వీరిలో ఒకరు నో చెప్పారన్నమాట.

ఇప్పుడొకసారి ఆ హీరోలే తమతో పెద్ద బడ్జెట్ లో సినిమాలు తీయమంటూ ీ ప్రొడ్యూసర్‌ల దగ్గరకు వెళ్తున్నారు. KGF తర్వాత హొంబాలే ఫిలిమ్స్ దేశవ్యాప్తంగా ఓ ప్రముఖ నిర్మాణ సంస్థగా నిలిచింది. రాబోయే 5 ఏళ్లలో వరసగా టాప్ హీరోలతో భారీ ప్రాజెక్టులు చేస్తున్నారు. ‘కాంతార: ఛాప్టర్ 1’ రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారు. సలార్ తర్వాత ప్రబాస్‌తో మూడు సినిమాలు కూడా సైన్ చేశారు.

, , , , ,
You may also like
Latest Posts from