మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) కాంబోకి ఫ్యాన్స్ ఉన్నారు. గురూజీ కథలతో వెంకీ విజయవంతమైన సినిమాలు చేశారు. ఈ కాంబోలో కొత్త సినిమా రెడీ అవుతోంది. వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అది పూజతో మొదలైంది.

పూజతో మొదలైన వెంకీ 77

వెంకటేష్, త్రివిక్రమ్ కలయికలో సినిమాకు ఓ ప్రత్యేకత ఉంటుంది. అది ఏమిటంటే… త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకీ హీరోగా నటిస్తున్న మొదటి సినిమా ఇది. హీరోగా ఆయన 77వ సినిమా. ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైందీ సినిమా. ఎన్నాళ్ళ నుంచో ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సినిమాకు తొలి అడుగు పడింది. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఈ ప్రారంభోత్సవానికి హాజరు కావడంతో పాటు ముహూర్తపు సన్నివేశానికి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

కుటుంబ కథా చిత్రంగా వెంకీ77 రూపొందుతోందని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత సూర్యదేవర రాధాకృష్ణ (చిన బాబు) నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ శైలి కథ, కథనాలతో పాటు స్వచ్ఛమైన వినోదం, లోతైన భావోద్వేగాలతో నిండిన కుటుంబ కథతో ఈ సినిమా ఉంటుందని ఆయన తెలిపారు. చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుందని తెలిపారు.

, , , ,
You may also like
Latest Posts from