ఏపీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారిగా వెండితెరపై మెరిసిన చిత్రం హరిహర వీరమల్లు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మించారు. క్రిష్ జాగర్లముడి తొలుత ఈ ప్రాజెక్ట్ ను డైరెక్ట్ చేశారు. కానీ ఆలస్యం అవడంతో ఆయన తప్పుకొని ఏఎం రత్నం దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు.
హరిహర వీరమల్లు : పార్ట్ 1ను జూలై 24న గ్రాండ్ గా విడుదల చేశారు. నిధి అగర్వాల్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఎంఎం కీరవాణి సంగీం అందించారు. ఈ సినిమా మార్నింగ్ షోకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా కలెక్షన్స్ వైజ్ గానూ వీకెండ్ కూడా నిలబడలేకపోయింది.
అయితే ఇప్పుడా టాపిక్ లేదు అనుకున్న సమయంలో ఈ సినిమా హీరో, పవర్‌స్టార్, ఇప్పుడు డిప్యూటీ సిఎం అయితే పవన్ కళ్యాణ్ కి కొత్త తలనొప్పి వచ్చి పడింది. మాజీ IAS అధికారి విజయ్ కుమార్ హైకోర్టులో ఓ పిటిషన్ వేసి బాంబ్ పేల్చాడు. “హరి హర వీరమల్లు” సినిమా కోసం ప్రభుత్వ ఫండ్స్ వాడేశారని, పవన్ తన పొలిటికల్ పవర్‌ని సినిమా ప్రమోషన్ కి మలిచేశారని ఆయన ఆరోపించారు.
అంతే కాదు… ఈ వ్యవహారం మీద CBI దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. హైకోర్టు ఇప్పటికే కేసులో CBI, ACB పేర్లు చేర్చమని ఆదేశించింది. ఫైనల్ హియరింగ్ వచ్చే వారం.
ఇక మరోవైపు, జూలై 24న రిలీజ్ అయిన “హరి హర వీరమల్లు” భారీ అంచనాల మధ్య వచ్చి డిజాస్టర్ అయ్యింది. డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయి ఇప్పుడు GST రిఫండ్ కోసం నిర్మాతలమీద ప్రెజర్ పెడుతున్నారు. హరి హర వీరమల్లు చిత్రం బడ్జెట్, ప్రీ రిలీజ్ లెక్కల ప్రకారం ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.260 కోట్లు గ్రాస్ వసూల్ చేయాల్సి ఉండింది.
కానీ టోటల్ గా బాక్సాఫీస్ వసూళ్లు ప్రపంచ వ్యాప్తంగా రూ.118 కోట్లు అందాయి. దీంతో ఇంకా రూ.132 కోట్లు నష్టాల్లోనే ఉందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా భారీగానే అందినా ఇంకా రూ.60 కోట్ల రూపాయలకు పైగానే నష్టాలు చవిచూసిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.
మొత్తానికి – సినిమా ఫ్లాప్, డిస్ట్రిబ్యూటర్ల ప్రెజర్, హైకోర్టు కేసు… ఇలా పవన్ కి బ్యాక్ టు బ్యాక్ టు బ్యాక్ షాకులు పడుతున్నాయి.