జాన్వీ కపూర్ – సిద్ధార్థ్ మల్హోత్రా కాంబినేషన్‌లో ఈ వారం ‘పరమ్ సుందరి’ అనే హిందీ సినిమా భారీ హైప్‌తో థియేటర్లలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ట్రైలర్‌లో జాన్వీ చెప్పిన “రజనీకాంత్ – మోహన్‌లాల్ – అల్లు అర్జున్ – యష్” డైలాగ్ సౌత్ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. కానీ రిలీజ్ తర్వాత సీన్ ఏకంగా రివర్స్ అయ్యింది. అనుకున్న స్దాయిలో సినిమాకు టాక్ రాలేదు. రొటీన్ రొమాంటిక్ కామెడీ అని ప్రేక్షకులు తేల్చేసారు. అటు నార్త్ లోనూ, ఇటు సౌత్ లోనూ ఎక్కడా పెద్ద బజ్ కనపడటం లేదు.
దాంతో ఫస్ట్ వీకెండ్‌కి ఇండియాలో ₹27 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అయితే ఓపెనింగ్ బాగానే ఉన్నా, ఆ తర్వాత కలెక్షన్స్ డ్రాప్ దారుణంగా కనపడింది.
మరో ప్రక్క కేరళలో ఓనం రిలీజ్ కూడా ఈ సినిమాకు వర్కౌట్ కాలేదు . అక్కడి ఆడియన్స్ పట్టించుకోకపోవడంతో, జాన్వీ చేసిన కేరళ అమ్మాయి రోల్ కూడా పెద్దగా ఫలితం ఇవ్వలేదు.
ఈ క్రమంలో అసలైన టెన్షన్ మాత్రం ఇప్పుడు మొదలవుతోంది.
- వీక్ డేస్‌లో నిలబడగలదా?
- రెండో వీకెండ్ వరకు బాక్సాఫీస్‌లో బరిలో నిలిచేనా?
ఏదైమైనా… ‘పరమ్ సుందరి’ హిట్టా? ఫట్టా? అన్నది వచ్చే వారంలోనే తేలిపోనుంది!
చిత్రం కథేంటంటే…
పరమ్ సచ్ దేవ్ (సిద్ధార్థ్ మల్హోత్రా) ఓ పెద్ద బిజినెస్ ఫ్యామిలీకి వారసుడు. తండ్రి అతడిని కంపెనీ బాధ్యతలు తీసుకోమని ఒత్తిడి చేస్తుంటాడు. కానీ పరమ్ మాత్రం తన కాళ్ల మీద నిలబడాలని, సొంత ఐడియాలతో ఎదగాలని కలలు కంటాడు. స్టార్టప్స్ మొదలుపెట్టి పలు ప్రయత్నాలు చేస్తాడు, కానీ ఒక్కటిలోనూ సక్సెస్ దక్కదు.
ఇలాంటి సమయంలో స్నేహితుడు శేఖర్ (అభిషేక్ బెనర్జీ) ‘ఫైండ్ మై సోల్ మేట్’ అనే యాప్ గురించి చెబుతాడు. ఆ యాప్ ద్వారా జీవిత భాగస్వామిని కనుగొనొచ్చని చెప్పడంతో పరమ్‌కి ఆసక్తి కలుగుతుంది. రీసెర్చ్ చేస్తూ, ఆ యాప్‌లో ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచన వస్తుంది. తండ్రి దగ్గర రూ.5 కోట్లు అడుగుతాడు. అయితే తండ్రి, “ఇప్పటికే నీ మీద చాలానే ఖర్చు చేశాను. ముందు నీ సోల్ మేట్‌ను కనుక్కో… తర్వాత ఇన్వెస్ట్ చేస్తాను” అని షరతు పెడతాడు.
అప్పుడే యాప్‌లో అతనికి కేరళలో నివసించే సుందరి దామోదరన్ పిళ్ళై ప్రొఫైల్ కనిపిస్తుంది. వెంటనే పరమ్ కేరళకి బయలుదేరుతాడు. అక్కడ సుందరి కోసం వెతికే ప్రయాణంలో ఎన్నో ట్విస్టులు ఎదురవుతాయి. ఆమెను దగ్గర చేసుకున్న తర్వాత అతని జీవితంలో ఏం జరుగుతుంది? అన్నదే మిగిలిన కథ.