దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘కాంతార చాప్టర్-1’ (Kantara Chapter 1)కి తెలుగు సినీ స్టార్ హీరోల మద్దతు భారీ బూస్ట్‌గా మారుతోంది. కర్ణాటక సరిహద్దుల నుంచి పుట్టుకొచ్చిన ఈ జానపద గాథ ఇప్పుడు పాన్-ఇండియా డివోషనల్ ఎక్స్‌పీరియన్స్గా మారబోతోంది.

రెబల్ స్టార్ ప్రభాస్ స్వయంగా ట్రైలర్ రిలీజ్ చేసి, సినిమాకు ఉన్న ఆధ్యాత్మికత, సాంస్కృతిక ఘనం గురించి పొగడ్తలతో ముంచెత్తారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ విజయవాడలో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరై, రిషబ్ శెట్టి ప్రతిభను మెచ్చుకున్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏపీలో టికెట్ ధరలు పెంచడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, సినిమా భక్తి భావనను గుర్తించారు.

విజయవాడ ఎక్స్‌పో గ్రౌండ్స్‌లో ఘనంగా జరిగిన ప్రమోషన్ ఈవెంట్‌లో రిషబ్ శెట్టి, హీరోయిన్ రుక్మిణి వాసంత్, ఇతర నటీనటులు హాజరయ్యారు.

2022లో సెన్సేషన్ అయిన ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాలో రిషబ్ శెట్టి ‘బెర్మే’ అనే నాగసాధువు పాత్రలో అలరించబోతున్నారు. రుక్మిణి వాసంత్ ‘కనకవతి’ గా కనిపిస్తుండగా, గుల్షన్ దేవైయా విలన్ ‘కులశేకర’ గా, జయరామ్ కీలక పాత్రలో నటించారు.

బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం, అర్వింద్ కశ్యప్ సినిమాటోగ్రఫీ ఈ పౌరాణిక గాథకు ప్రాణం పోశాయి.

ఇప్పుడీ కాంతార కేవలం సినిమాగా కాదు… తెలుగు స్టార్ పవర్‌తో కలసి దేశమంతా ఆధ్యాత్మిక అలజడి రేపబోతోంది!

, , , ,
You may also like
Latest Posts from