
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు పూర్తిగా ‘ది రాజా సాబ్’ పై ఫోకస్ పెట్టారు. సంక్రాంతి 2026కి ఈ చిత్రం విడుదల కానుందని టాక్. ఈ అక్టోబర్‌లోపే షూట్ మొత్తాన్ని పూర్తి చేయాలని టీమ్ టార్గెట్ పెట్టుకుంది.
ఇక ప్రభాస్ మరో భారీ ప్రాజెక్ట్ ‘ఫౌజీ’ కూడా షూటింగ్ మోడ్‌లో ఉంది. కానీ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత లేదు. మరోవైపు, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ కోసం కూడా వంగా ప్రభాస్ కోసం వేచి చూస్తున్నారు.
తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం — ‘ఫౌజీ’ సినిమాను 2026 ఆగస్ట్ 14న, అంటే స్వాతంత్ర్యదినోత్సవానికి ముందు రోజు రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే ఏడాది ప్రారంభంలో వెలువడే అవకాశం ఉంది.
ఇప్పటివరకు కొన్ని యాక్షన్ సన్నివేశాలు మాత్రమే బ్యాలెన్స్‌లో ఉన్నాయని, అవి త్వరలోనే షూట్ చేయనున్నారని టాక్. స్వాతంత్ర్య సమయానికి ముందు నాటి నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రభాస్ ఒక సాహసోపేత సైనికుడి పాత్రలో కనిపించనున్నాడు.
హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇమన్వీ హీరోయిన్‌గా నటిస్తుండగా, విషాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.
