ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైమ్? ఆస్కార్ నామినేషన్‌కు దగ్గరలో ఉన్న మహావతార్ నరసింహా!
స్టార్ హీరోలూ లేరు… భారీ యాక్షన్ మసాలా కూడా లేదు… ప్రచారాలెక్కడో పక్కన… అయినా బాక్సాఫీస్ దగ్గర రాక్షసుడిలా దూసుకెళ్లి రికార్డులు కొల్లగొట్టిన చిత్రం మహావతార్ నరసింహా ఇప్పుడు మరొక అద్భుతాన్ని నమోదు చేసుకుంది. పాన్ ఇండియా లెవెల్లో 200కు పైగా థియేటర్లలో 50 రోజులు విజయవంతంగా ఆడిన ఈ చిన్న సినిమా, మొత్తంగా ₹340 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఓటీటీకి వచ్చిన తర్వాత కూడా ఇదే ఫారం—నెట్‌ఫ్లిక్స్‌లో రెక్కార్డులు బద్దలు కొట్టేసింది. థియేటర్లలో, ఓటీటీలో దుమ్మురేపిన ఈ మూవీ ఇప్పుడు ప్రత్యక్షంగా ఆస్కార్ బరిలోకి దూకింది!
98వ అకాడమీ అవార్డ్స్ క్వాలిఫికేషన్ పొందిన ‘మహావతార్ నరసింహా’!
వరల్డ్‌లోనే బిగ్గెస్ట్ యానిమేటెడ్ మూవీగా పేరుతెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఆస్కార్–2026 యానిమేటెడ్ కేటగిరీలో అధికారికంగా క్వాలిఫై అయ్యింది. హోంబాలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం, నరసింహ పురాణం, విష్ణు పురాణం, శ్రీమద్భాగవత పురాణం ఆధారంగా దర్శకుడు అశ్విన్ కుమార్ తెరకెక్కించారు.
నామినేట్ అయితే ఇండియా హిస్టరీ!
ఈ ఏడాది యానిమేటెడ్ విభాగంలో మొత్తం 35 సినిమాలు పోటీ పడుతున్నాయి. వీటిలో మహావతార్ నరసింహా కూడా ఒకటి.
ఈ చిత్రం ఫైనల్ నామినేషన్‌కు ఎంచుకోబడితే—
ఆస్కార్ నామినేషన్ పొందిన భారతదేశపు ఫస్ట్ యానిమేటెడ్ ఫిల్మ్ అవుతుంది! అందుకే ఇప్పుడు మొత్తం ఇండస్ట్రీ, ఫాన్స్, ప్రపంచం చూపు జనవరి 22, 2026పై ఉంది.
కీలక తేదీలు
నామినేషన్ లిస్ట్: జనవరి 22, 2026
అవార్డు ప్రదానం: మార్చి 15, 2026
ఇకపోతే, దర్శకుడు నీరజ్ ఘయ్వాన్ రూపొందించిన హోమ్‌బౌండ్ సినిమా ఇప్పటికే భారత తరఫున బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో అధికారిక ఎంట్రీగా ఎంపికైంది.
మరి ‘మహావతార్ నరసింహా’ నిజంగా ఆస్కార్ నామినేషన్ దాకా వెళ్లి హిస్టరీ క్రియేట్ చేస్తుందా?
అన్నది చూడాలి!
