
‘అఖండ 2’ టికెట్ సేల్స్ పరిస్దితి ఏమిటి!
ప్రీమియర్స్ స్టార్ట్ కావడానికి గంటల ముందు నుంచే తెలుగు రాష్ట్రాల్లో ఒక్క మాటే వినిపిస్తోంది — “అఖండ 2 టికెట్ దొరికిందా?”బాలయ్య – బోయపాటి కాంబినేషన్‌కు ఉన్న స్టాండర్డ్ క్రేజ్ ఈసారి మరింత పెరిగింది. పోస్ట్‌పోన్ డ్రామా తర్వాత విడుదలవుతున్న కారణంగా, హైప్ ఇప్పుడు ఫీవర్ పీక్ దాటి మరింత అగ్రెసివ్ మోడ్‌లోకి వెళ్లింది.
APలో తీర్థయాత్రలా రష్ – BookMyShowలో ఆల్-ఇండియా నంబర్ 1!
ఆంధ్ర ప్రదేశ్‌లో పరిస్థితి ఏంటంటే థియేటర్ల ముందు ఎర్లీ మార్నింగ్ నుంచే పెద్ద క్యూ లైన్లు! అదే సమయంలో నిజాం ప్రాంతం ఎదురు చూసినంత కాలం బుకింగ్స్ లేట్‌గా ఓపెన్ అయినా… ఫ్రెంజీని అదే సెకన్లలో మ్యాచేసింది! ఆన్లైన్ ప్లాట్ఫార్మ్లు రియల్టైమ్గా క్రేజ్‌ని చూపుతున్నాయి:
BookMyShowలో అఖండ 2 – ఇండియా వైడ్ నెంబర్ 1!
కేవలం 24 గంటల్లోనే 1.12 లక్షలకుపైగా టికెట్లు విక్రయం!
అది BookMyShow ఒక్కటే…
కలిసేలో ఇతర ప్లాట్ఫార్మ్స్ + డైరెక్ట్ బుకింగ్స్ కలిస్తే ఆ సంఖ్య ఇంకా పెద్దదే.
విదేశాల్లోనూ ఇదే పరిస్థితి —
అమెరికా ప్రీమియర్ ప్రీ-సేల్స్ ఇప్పటికే $250K దాటేశాయి!
ఇంకా అనేక థియేటర్లు బుకింగ్స్ స్టార్ట్ చేయనేలేదు…
అంటే ఈ సంఖ్య డబుల్–ట్రిపుల్ అవడమంటే ఆశ్చర్యమే కాదు!
ఈ ఓపెనింగ్ రేంజ్ చూస్తే… రికార్డులు బ్రద్దలు ఖాయం!
తెలుగు రాష్ట్రాల నుంచి ఓవర్సీస్ వరకూ, ప్రస్తుత ఉత్సాహాన్ని చూస్తే స్పష్టంగా తెలుస్తోంది — ‘అఖండ 2’ ఈ ఏడాది అత్యంత భారీ ఓపెనింగ్‌కు సిద్ధమవుతోంది. NBK – బోయపాటి కలయిక పట్ల జనాల్లో ఉన్న నమ్మకం, దానికి తోడు ఈసారి వచ్చిన భావోద్వేగ + భక్తి + మాస్ మిక్స్… అన్నీ కలిసి బాక్సాఫీస్‌ను తాండవ స్థాయికి తీసుకెళ్లబోతున్నాయి.
ఒక్క మాటలో చెప్పాలంటే —
“ప్రీమియర్‌కి ముందే పండగ స్టార్ట్… ఓపెనింగ్ డే అయితే అఖండ బ్లాస్ట్!”
