
సంక్రాంతి సీజన్ మొత్తం చిరంజీవికే…? భలే మాస్టర్ ప్లాన్
సంక్రాంతి రిలీజ్ అంటే సినిమా హిట్‌కు సగం పని పూర్తయినట్టే. స్కూల్ సెలవులు, ఆఫీస్ బ్రేక్‌లు, ఫ్యామిలీ గ్యాదరింగ్స్, మల్టిపుల్ విజిట్స్… ఇవన్నీ కలిసొచ్చే టైమ్‌లో సినిమా రిలీజైతే ఓపెనింగ్స్ మాత్రమే కాదు, లాంగ్ రన్ కూడా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అదే ఫార్ములాను ఈసారి చిరంజీవి సినిమా ‘మన శంకర వరప్రసాద్’ పర్ఫెక్ట్‌గా క్యాష్ చేసుకుంటోంది.
చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్’ షూటింగ్‌ను పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. మేకర్స్ ఇప్పుడు రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశారు. సంక్రాంతికి కాస్త ముందుగా, జనవరి 12న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 12 సోమవారం కావడంతో, అంతకుముందు రోజు ఆదివారం నుంచే ప్రీమియర్స్ ప్లాన్ చేసే అవకాశం కూడా ఉంది.
ఇది కేవలం ఒక రిలీజ్ డేట్ కాదు… పండగ సెలవులన్నింటినీ కవర్ చేసే వ్యూహం. సోమవారం రిలీజ్‌తో వీక్‌డేస్ స్ట్రాంగ్‌గా ఓపెన్ చేసి, సంక్రాంతి సెలవుల్లో మాస్ & ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు లాక్కునేలా మేకర్స్ ప్లాన్ చేశారు. అందుకే ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్‌తో పాటు స్ట్రాంగ్ బాక్సాఫీస్ రన్ ఉంటుందని నిర్మాతలు గట్టిగా నమ్ముతున్నారు. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. విడుదలైన రెండు పాటలు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.
దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉండటం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. ప్రమోషన్స్ విషయంలో కూడా ఆయన గట్టిగా ప్లాన్ చేస్తుండటంతో, రీలీజ్ వరకు బజ్ తగ్గే అవకాశం కనిపించడం లేదు. దీనికి తోడు వెంకటేష్ ప్రత్యేక పాత్రలో కనిపించడం మరో అదనపు ఆకర్షణగా మారింది. ఈ క్రేజీ కాంబినేషన్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. సంక్రాంతి బరిలో ఉన్న ఇతర సినిమాలతో పోలిస్తే, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఎక్కువగా టార్గెట్ చేసే చిత్రంగా ‘మన శంకర వరప్రసాద్’ ముందువరుసలో నిలిచింది.
