సినిమా వార్తలు

‘స్పిరిట్’ సెట్స్‌కి ప్రభాస్ – ఫ్యాన్స్‌కు షాకింగ్ అప్‌డేట్!

ప్రభాస్ సినిమాలు అంటే ఇప్పుడు పాన్ ఇండియా కాదు…పాన్ వరల్డ్. రీసెంట్‌గా టోక్యోలో జరిగిన ఇంటరాక్షన్‌లో ప్రభాస్ జపాన్ ఫ్యాన్స్‌ను ఫిదా చేసిన విషయం తెలిసిందే. ఓవర్సీస్‌లో క్రేజ్ రోజురోజుకీ పెరుగుతుండగా, ఆయన నెక్స్ట్ మూవ్స్‌పై కూడా భారీ ఆసక్తి నెలకొంది. ఇదే టైమ్‌లో ప్రభాస్ లైనప్‌లో ఉన్న‘స్పిరిట్’ నుంచి మాస్ అప్‌డేట్ బయటకు వచ్చింది! జనవరి 9, 2026కి థియేటర్లలోకి రాబోతున్న‘ది రాజా సాబ్’ కోసం ప్రభాస్ ఒకటి రెండు ప్రమోషనల్ ఈవెంట్స్‌కు హాజరయ్యే ఛాన్స్ ఉందట. అయితే, తన అలవాటు ప్రకారం లాంగ్ ప్రమోషన్స్‌కు దూరంగా ఉంటూ, ఒక జనరల్ ప్రెస్ మీట్ లేదా సెలెక్టివ్ అపియరెన్స్‌తో సరిపెట్టే అవకాశముంది.

‘ది రాజా సాబ్’ రిలీజ్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాక ప్రభాస్ తిరిగిసందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోని ‘స్పిరిట్’ సెట్స్‌కి వెళ్లనున్నారు. ఈ నెల ఆరంభంలోనే ఆయన ఈ సినిమాకు సంబంధించిన ఒక చిన్న కానీ కీలక షెడ్యూల్‌ను పూర్తి చేశారు. ఇప్పుడు వచ్చే షెడ్యూల్‌కి మాత్రం వంగాహై-ఇంటెన్సిటీ ప్లాన్ చేస్తున్నట్టు టాక్! ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, హైదరాబాద్‌లోభారీ సెట్‌లు నిర్మాణంలో ఉన్నాయి. రాబోయే షెడ్యూల్‌లో ప్రభాస్‌తో పాటు దాదాపు200 మంది ఫైటర్స్ పాల్గొనే భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించనున్నారట. ఇది సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు.

తృప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్నిటీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ‘స్పిరిట్’ ఇప్పటికే ప్రభాస్ కెరీర్‌లోనే అత్యంత అంబిషస్ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా మారింది. ఇప్పుడు 200 మంది ఫైటర్స్‌తో యాక్షన్ బ్లాక్స్ అంటే…వంగా నిజంగా ఏ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నాడు? ప్రభాస్ కొత్త అవతార్‌లో ఈ సీన్ థియేటర్లను ఎలా ఊపేస్తుందో చూడాల్సిందే!

Similar Posts