తాజాగా మార్చి 27న విడుదలైన మోహన్ లాల్ పాన్ ఇండియా మూవీ ‘ఎల్ 2: ఎంపురాన్’ (L2: Empuraan) తో మరోసారి జాతీయ స్థాయిలో అభిమన్యు సింగ్ గురించి జనాలు మాట్లాడుకునేలా చేసిన సంగతి తెలిసిందే.అయితే అదే సమయంలో ఈ సినిమా ఈ నటుడుని వివాదాల్లోకి తోస్తోంది.

మోహన్ లాల్ (Mohan Lal) హీరోగా పృథ్వీరాజ్ తెరకెక్కించిన ‘ఎంపురాన్’ మూవీలో అభిమన్యు సింగ్ మెయిన్ విలన్ గా నటించారు. ఇదే అతనికి తొలి మలయాళ చిత్రం. గుజరాత్ లో జరిగిన అల్లర్లలో ముస్లిమ్స్ మానప్రాణాలు తీసే బలరాజ్ పటేల్ అనే కరుడుగట్టిన హిందుత్వ వాదిగా అభిమన్యుసింగ్ నటించాడు. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టుగా అప్పటి ఆ మతోన్మాది ఎలా జాతీయ రాజకీయాల్లో ఆ తర్వాత కీలకనేత బజరంగీగా మారాడు అనేది ‘ఎంపురాన్’ చిత్రంలో చూపించారు.

‘ఎంపురాన్’ మూవీ విడుదలైనప్పటి నుండి జాతీయ వాదులు ఈ చిత్రంలోని పలు సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు పృథ్వీరాజ్ హిందువులపై తనకున్న ద్వేషాన్ని అభిమన్యు సింగ్ పాత్ర ద్వారా వెల్లడించాడని విమర్శిస్తున్నారు.

, , , , ,
You may also like
Latest Posts from