హన్సికా మోత్వానీ (Hansika Motwani) బాంబే హైకోర్ట్‌ను ఆశ్రయించింది. త‌న‌పై న‌మోదైన గృహ హింస (domestic violence) కేసును కొట్టివేయాల‌ని కోరుతూ బాంబే హైకోర్టులో(Bombay High Court) క్వాష్ పిటిష‌న్ దాఖాలు చేసింది.

గ‌తేడాది ప్రశాంత్‌ మోత్వానీ (హన్సికా మోత్వానీ సోదరుడు) భార్య ముస్కాన్ నాన్సీ హన్సిక కుటుంబంపై గృహ హింస కేసును న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. 2024న డిసెంబర్ 18న ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్‌లో ఈ ఫిర్యాదు నమోదైంది.

ముస్కాన్‌ హిందీ టీవీ సీరియల్‌ నటి. పలు సూపర్ హిట్ సీరియల్స్‌తో నార్త్‌లో పాపులారిటీని సొంతం చేసుకున్న ముస్కాన్‌తో 2020లో ప్రశాంత్ ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ పెద్దల అంగీకారంతో 2021లో పెళ్లి పీటలు ఎక్కారు. పెళ్లి అయిన ఏడాదిలోపే ప్రశాంత్, ముస్కాన్‌ వైవాహిక బంధంలో విభేదాలు తలెత్తాయి. హన్సికతో పాటు ఆమె ఫ్యామిలీ మొత్తంపై ఈ కేసు పెట్టింది మస్కాన్.

గత రెండేళ్లుగా ముస్కాన్‌, ప్రశాంత్‌ విడివిడిగా ఉంటున్నారు. 2024 డిసెంబర్‌ 18న ముస్కాన్‌ ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్‌లో గృహ హింస కేసు పెట్టింది. ప్రశాంత్‌తో పాటు అతడి మొత్తం కుటుంబ సభ్యులపై ముస్కాన్ ఆరోపణలు చేసింది.

తన అత్తా మామలతో పాటు తన భర్త ప్రశాంత్‌ సోదరి అయిన హన్సికల జోక్యం తమ వైవాహిక జీవితంలో ఎక్కువ కావడంతో గొడవలు మొదలు అయ్యాయి అంటూ పేర్కొంది. ప్రశాంత్ కుటుంబ సభ్యులు అంతా అనవరస జోక్యం చేసుకోవడంతో పాటు, ఆస్తుల విషయంలోనూ అన్యాయం చేసే విధంగా చూశారని, తనను మానసికంగా, శారీరకంగా చాలా రోజులు హింసించారు అంటూ ముస్కాన్ ఫిర్యాదులో పేర్కొంది.

తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా నటించి ఎంతోమంది ఫ్యాన్స్‌ని సంపాదించుకుంది హన్సిక. ప్రస్తుతం బుల్లితెరపై ఓ షోకి జడ్జీగా వ్యవహరిస్తుంది హన్సిక. అయితే ఇన్నాళ్లు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి వివాదం లేకుండా కొనసాగిన హన్సిక తాజాగా చిక్కుల్లో పడింది.

, ,
You may also like
Latest Posts from