డ్రగ్స్ కేసులో చిక్కుకున్న హీరో శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్‌కు మద్రాస్ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే… బెయిల్ కంటే ముందే షాక్ ఇచ్చిన వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి.
ఒక పబ్‌లో జరిగిన చిన్న గొడవ… పెద్ద కేసుకి నాంది అయ్యింది. ఆ గొడవలో అరెస్ట్ అయిన కృష్ణ అనే వ్యక్తి విచారణలో శ్రీరామ్ పేరు బయటపెట్టాడు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు శ్రీరామ్‌ను అదుపులోకి తీసుకుని డ్రగ్ టెస్టులు చేశారు. ఫలితంగా… పాజిటివ్ అని తేలింది!
తనకు కొకైన్ వాడకానికి అలవాటు ఉందని, కొన్నిసార్లు ఖరీదైన డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు శ్రీరామ్ ఒప్పుకున్నాడు. లెక్కలు చెక్కిలిపెట్టేలా – ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లతో సహా కొన్నిసాక్ష్యాలు దొరికాయి. దీంతో శ్రీరామ్ అరెస్ట్ అయ్యాడు.
ఇప్పుడు బెయిల్ వచ్చింది కానీ, దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. శ్రీరామ్ మాత్రమే కాదు… ఈ కేసులో మరికొంత మంది సినీ ప్రముఖులు, రాజకీయ నేతల పేర్లు కూడా చక్కర్లు కొడుతున్నాయట. పూర్తి నిజాలు బయటపడితే… ఇండస్ట్రీలో భయపెట్టే ప్రకంపనలు ఏర్పడే అవకాశం ఉందని వర్గాలు చెబుతున్నాయి.
ఇదంతా చూస్తే… ఈ డ్రగ్స్ కేసు మామూలు కేసు కాదు లేదు అనిపిస్తోంది!