అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనేది మానసిక సంబంధమైన వ్యాధి. ఇది వయసుతో సంబంధం లేకుండా 2సంవత్సరాల వయసు నుండి ఏ వయసువారికైనా వచ్చే అవకాశం ఉంటుంది. మనుషుల్లో భయం, ఒత్తిడి ఈ సమస్యకు మూలకారణాలు. ఒక విషయాన్ని పదేపదే ఆలోచించడం, అలా ఆలోచించేలా చేయడం ఇందులో ప్రధానం. పదే పదే ఒకే విషయాన్ని ఆలోచించడం వల్ల అది కాస్తా ఒత్తిడిగా మారుతుంది. ప్రముఖ సెలబ్రిటీలు కూడా ఈ ఓసిడి సమస్య వల్ల ఇబ్బంది పడినవారు, పడుతున్నవారు ఉన్నారు. అమెరికా మాజీ అద్యక్షుడు ట్రంప్, పాప్ రారాజు మైఖెల్ జాక్సన్ కూడా ఈ ఓసిడి సమస్యతో ఇబ్బింది పడినవారే. అలాంటి వారిలో స్నేహ ఒకరు.

అనారోగ్యాలకు సినిమావాళ్లేమీ అతీతులు కారు. అయితే వారు వాటిని బహిరంగంగా చెప్పరు అంతే. స్కిన్ షోకు దూరంగా ఉంటూ తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ ని క్రియేట్ చేసుకున్న స్నేహ వివాహం చేసుకుని సినిమాలు తగ్గించేసింది. ఆమె అప్పుడప్పుడు తమిళ సినిమాల్లో, యాడ్ లలో కనిపిస్తూంటుంది. అయితే ఆమెకు ఓసిడి సమస్య ఉందని ఆమె భర్త స్వయంగా చెప్పటం తో బయిటకు వచ్చింది. అలాగే ఓ ఇంటర్వూలో స్నేహ ఈ సమస్య గురించి మాట్లాడింది. అందులో, తనకు OCD సమస్య ఉందని చెప్పింది. దాంతో ఈ జంట ఇప్పటికి మూడు ఇళ్లు మార్చారట.

స్నేహ మాట్లాడుతూ…నా ఇల్లు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. వంటగది శుభ్రంగా ఉన్నా కూడా నేను ఆశించేది అదే. ఈ OCD సమస్య చాలా అరుదు అయినప్పటికీ… దాని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఈ సమస్య ఉన్న వ్యక్తులు ప్రతిదాన్ని శుభ్రంగా మరియు పరిపూర్ణంగా చూస్తారు అని చెప్పుకొచ్చింది.

స్నేహ…ఒకప్పుడు దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో బాగా ఫేమస్. ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. గ్లామర్ కు దూరంగా కేవలం హోమ్లీ రోల్స్ పోషిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయం పరంగా జూనియర్ సౌందర్యగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. పెళ్లయినా అందం విషయంలో కానీ, పాపులారిటీ విషయంలో కానీ ఈ ముద్దుగుమ్మ అసలు తగ్గడం లేదు.

You may also like
Latest Posts from