విదాముయార్చి తర్వాత స్టార్ హీరో అజిత్ కుమార్‌ నటించిన తాజా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ సినిమాను అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ మూవీని టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో నిర్మించారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ విడుదలకు అంతా సిద్దమైంది. ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.

ఈ క్రమంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా తాజాగా దీని తెలుగు ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు (Good Bad Ugly Telugu Trailer). భయాన్నే భయపెడతాడు అనే డైలాగులు పవర్‌ఫుల్‌గా ఉన్నాయి.

, ,
You may also like
Latest Posts from