
2025లో సంయుక్త కు ‘అఖండ 2’ షాక్… డిప్రెషన్ లో ?
తెలుగు పరిశ్రమలో బిజీ నటిగా గుర్తింపు తెచ్చుకున్నసంయుక్త మీనన్ కు 2025 సంవత్సరం మాత్రం ఆశించిన స్థాయిలో కలిసి రాలేదనే చెప్పాలి. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ, ఈ ఏడాది ఆమెకు కెరీర్ పరంగా చాలా సైలెంట్‌గా ముగిసింది. ముఖ్యంగా ఏడాది చివరికి వచ్చేసరికి, ఆమె ఖాతాలో ఒక్క హిట్ కూడా లేకపోవడం నిరాశపరిచింది.
మొదట్లో 2025లో సంయుక్త మీనన్ కు రెండు తెలుగు సినిమాలు విడుదల కావాల్సి ఉంది. అయితే వాటిలో ఒకటైన ‘నారి నారి నడుమ మురారి’ చిత్రం వాయిదా పడుతూ సంక్రాంతి 2026కి వెళ్లిపోయింది. దాంతో 2025లో ఆమెకు విడుదలైన ఏకైక తెలుగు సినిమా ‘అఖండ 2: తాండవం’గా మిగిలింది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, ఫలితం మాత్రం భిన్నంగా వచ్చింది. దాంతో ఆమె ఎంతో ఎక్సెపెక్టేషన్స్ పెట్టుకున్న సినిమా వర్కవుట్ కాకపోవటంతో డిప్రెషన్ లోకి వెళ్లినట్లు చెప్పుకుంటున్నారు.
‘అఖండ 2’లో సంయుక్త మీనన్ ఆర్చనా గోస్వామి అనే డీఆర్‌డీఓ మిలిటరీ ఆఫీసర్ పాత్రలో కనిపించింది. పేపర్ మీద ఈ క్యారెక్టర్ బలంగా అనిపించినా, తెరపైకి వచ్చేసరికి అది చాలా రొటీన్‌గా మారిపోయింది. ఆమె స్క్రీన్ టైమ్ ఎక్కువగా మొదటి భాగానికే పరిమితమైంది. బాలకృష్ణతో రొమాంటిక్ ట్రాక్, ‘జాజికాయ’ అనే మాస్ పాట వరకు మాత్రమే ఆమె పాత్ర సాగింది. కథలో కీలకమైన మలుపులు తిప్పే అవకాశం ఈ పాత్రకు లేకపోవడంతో,సంయుక్త మీనన్ నుంచి ప్రత్యేకమైన ఇంపాక్ట్ రాలేదు.
ఇదే సమయంలో సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా తడబడింది. తొలి వారాంతం పూర్తయ్యేలోపే ‘అఖండ 2’ కమర్షియల్ ఫ్లాప్‌గా మారినట్టుగా ట్రేడ్‌లో స్పష్టత వచ్చింది. సినిమా ఫలితం సంయుక్త మీనన్ కు మరింత నిరాశను మిగిల్చింది, ఎందుకంటే ఇది ఆమెకు 2025లో వచ్చిన ఏకైక సోలో రిలీజ్.
అలా ఒక హిట్ లేకుండానే 2025ని ముగించినసంయుక్త మీనన్, ఇప్పుడు పూర్తిగా 2026పై ఆశలు పెట్టుకుంది. వచ్చే ఏడాదిలో ఆమెకు ‘నారి నారి నడుమ మురారి’, ‘స్వయంభూ’, ‘స్లమ్‌డాగ్’ వంటి తెలుగు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులలో అయినా ఆమెకు బలమైన పాత్రలు దక్కితే, ఈ ఏడాది వచ్చిన నిరాశను పూర్తిగా మరిచిపోయే అవకాశం ఉందన్న నమ్మకం అభిమానుల్లో కనిపిస్తోంది.
మొత్తానికి, 2025సంయుక్త మీనన్ కు కెరీర్ పరంగా మౌనంగా గడిచిన సంవత్సరం కాగా, 2026 ఆమెకు తిరిగి ఊపు తీసుకువచ్చే ఏడాదిగా మారుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
