
‘అఖండ 2’ వీకెండ్ షాక్: బాలయ్య సినిమాకి ఇది సరిపోతుందా?
భారీ ఓపెనింగ్స్… ఫ్యాన్స్ హంగామా… కానీ వీకెండ్ ముగిసే సరికి టోన్ మారిపోయింది. నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ 2’ ఫస్ట్ వీకెండ్ బాక్సాఫీస్ రన్ పూర్తయ్యేసరికి, ట్రేడ్ వర్గాల్లో ఒకే మాట వినిపిస్తోంది – కలెక్షన్స్ బాగా తక్కువే! మిక్స్‌డ్ వర్డ్ ఆఫ్ మౌత్, నెగటివ్ రివ్యూస్ కారణంగా సినిమా ఆశించిన స్థాయిలో దూసుకెళ్లలేకపోయింది. టాక్ పాజిటివ్‌గా ఉండి ఉంటే నంబర్లు మరింత బలంగా ఉండేవని ట్రేడ్ విశ్లేషణ.
ఎక్కడ ఎంత వచ్చిందంటే…
ఫస్ట్ వీకెండ్‌లో ‘అఖండ 2’ వరల్డ్‌వైడ్ షేర్ ఇలా ఉంది
నైజాం: 14 కోట్లు
సీడెడ్: 9 కోట్లు
ఉత్తరాంధ్ర (UA): 4.15 కోట్లు
గుంటూరు: 4.7 కోట్లు
ఈస్ట్: 3.45 కోట్లు
వెస్ట్: 2.4 కోట్లు
కృష్ణా: 3 కోట్లు
నెల్లూరు: 2.2 కోట్లు
ROI: 4.4 కోట్లు
ఓవర్సీస్: 3.6 కోట్లు
మొత్తం వరల్డ్‌వైడ్ షేర్: 50.9 కోట్లు
ప్రీమియర్స్‌కు మంచి బుకింగ్స్ వచ్చినా, రివ్యూస్ వచ్చిన తర్వాత గ్రోత్ పూర్తిగా ఆగిపోయింది.
పెద్ద సమస్య : 110 కోట్ల బిజినెస్… 50% కూడా రికవరీ లేదు!
‘అఖండ 2’ థియేట్రికల్ రైట్స్ విలువ సుమారు 110 కోట్లు. అందులో ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి వచ్చిన రికవరీ **50% కన్నా తక్కువే. ఇది డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద టెన్షన్‌గా మారింది. ఇకపై సినిమా వీక్‌డేస్‌లో స్ట్రాంగ్ పికప్ చూపించకపోతే ఈ ప్రాజెక్ట్ హై-లాస్ వెంచర్ గా మారే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. సమాధానం కొన్ని రోజుల్లో తేలనుంది.
