వరస ఫ్లాఫ్ లతో వెనక బడ్డ అక్కినేని అఖిల్‌ సినిమాల విషయంలో స్పీడు పెంచుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్‌ మురళీ కిశోర్‌ అబ్బూరుతో ఆయన ఓ సినిమా చేస్తున్నారు. ఇదేకాకుండా యూవీ క్రియేషన్స్‌ బ్యానర్​లో కొత్త డైరెక్టర్ అనిల్‌తో ఓ భారీ పీరియాడిక్‌ మూవీ చేయనున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. తాజాగా అఖిల్‌ మరో కొత్త ప్రాజెక్ట్‌కు గ్రీ న్​ సిగ్నల్​ ఇచ్చినట్లు సమాచారం.

‘సామజవరగమన’ సినిమా సహ రచయిత నందు చెప్పిన కథకు అఖిల్​ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమా పూర్తిగా ఎంటర్ట్మెంట్ చిత్రంగా రూపొందనున్నట్లు సినీ వర్గాల టాక్​. అన్నీ కుదిరితే ఈ ఏడాదిలోనే షూటింగ్ స్టార్ట్​ చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ సినిమాకు శ్రీనివాస్ చిట్టూరి నిర్మాతగా వ్యవహరించే అవకాశమున్నట్లు టాక్​.

ఇక ఆమ‌ధ్య వెంక‌టేష్‌ని క‌లిసి ఇదే రచయిత నందు ఓ క‌థ చెప్పారు. వెంకటేష్ కి కూడా కూడా బాగా న‌చ్చింది. సినిమా ఓకే అనుకొన్నారంతా. అయితే.. ‘సంక్రాంతికి వ‌స్తున్నాం’ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవ్వ‌డంతో వెంకీ డైలామాలో ప‌డ్డారని దాంతో ప్రక్కన పెట్టారని వినికిడి. దాంతో నందు ఇప్పుడు అఖిల్ తో ముందుకు వెళ్తున్నారని వినిపిస్తోంది.

,
You may also like
Latest Posts from