‘గడసరి అత్త సొగసరి కోడలు’, ‘ఢీ’, వంటి అనేక టీవీ షోల ద్వారా ప్రజాదరణ పొందిన ప్రదీప్, యాంకరింగ్‌తో మాత్రమే కాకుండా సినిమాల్లోనూ ఎంట్రీ ఇచ్చి తన లక్ పరీక్షించుకుంటున్నారు. ఇందులో భాగంగానే 2021లో ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. అయితే, ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. అయితే బాగా గ్యాప్ తర్వాత, మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఆ సినిమానే ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో సందడి చేయనున్నారు. నితిన్- భరత్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ (Akkada Ammayi Ikkada Abbayi Movie Trailer)ను చిత్ర టీమ్ సోమవారం రిలీజ్ చేసింది. ఆద్యంతం నవ్వులు పంచేలా ఉంది.
ఒకే ఒక్క అమ్మాయి ఉన్న గ్రామానికి ప్రాజెక్టు పనిపై వెళ్లిన హీరోకి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? అన్న కాన్సెప్టుతో ఈ సినిమా తెరకెక్కినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో ప్రదీప్ సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఓ యువకుడిగా నటిస్తున్నాడు.
అనుకోని పరిస్థితుల్లో అతను ఓ పల్లెటూరికి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ అతనికి ఎదురైన అనుభవాలు, కథలో హీరోయిన్ పాత్ర.. లాంటి విషయాలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. ప్రదీప్‌కు జోడీగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ దీపిక పిల్లి నటించారు.