ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ ఏమిటి అంటే అలేఖ్య చిట్టి పచ్చళ్ల కాంట్రవర్సీ (Alekhya Chitti Pickles Controversy).ముగ్గురు అక్కచెళ్లెళ్లు కలిసి ప్రారంభించిన ఈ అలేఖ్య పికెల్స్.. ఇప్పుడు వివాదంలో కూరుకుపోయింది. కారణం, వారి నోటిదూలే. సోషల్ మీడియా ద్వారా ఎదిగిన వీరు..దాని ద్వారానే తమ వ్యాపారానికి తామే నిప్పుపెట్టుకున్నారు. కస్టమర్స్‌ని మెప్పించి, బిజినెస్‌ని పెంచుకోవాల్సిన ఈ సిస్టర్స్.. మీ పచ్చళ్లు అంత రేటా? అన్నందుకు బూతు పురాణం అందుకోవటంతో రచ్చ రంబోలా అయ్యిపోయింది.

ఆ కస్టమర్స్ వారి బూతులని సోషల్ మీడియాలో పెట్టేయడంతో.. ఒక్కసారి ఈ పచ్చళ్ల పాపలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే వారికి ఈ విషయంలో కొంత సానుభూతి కూడా లభిస్తుంది. వారు రేటు చెప్పారు.. నచ్చితే కొనుక్కోండి, లేదంటే వేరే చోట తీసుకోండి. అంతేకానీ, పదే పదే కావాలని వారిని ప్రశ్నిస్తూ, విసిగిస్తే.. రిప్లయ్‌లు అలాగే ఉంటాయి అంటూ కొందరు నెటిజన్లు ఈ పచ్చళ్ల పాపలకు మద్దతు తెలుపుతున్నారు.

ఇదిలా ఉంటే, ఈ అలేఖ్య పచ్చళ్ల కాంట్రవర్సీతో ఇప్పుడు ఇంకో పేరు కూడా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. అదే చిరంజీవి కుటుంబానికి చెందిన ‘అత్తమ్మాస్ కిచెన్’. ఈ కిచెన్ ఎవరిదో తెలుసుగా. స్వయంగా మెగా కోడలు ఉపాసన (Upasana), తన అత్తగారైన సురేఖ (Surekha Konidela)తో పెట్టించారు.

ఇందులో ఉండే ఐటమ్స్ రేట్స్‌ని చూపిస్తూ.. అలేఖ్య పికెల్స్ కాదు.. అత్తమ్మాస్‌ కిచెన్‌లో పులిహోర, ఉప్మా, పొంగల్ కొనగలిగేవాడిని చూసుకోండి.. అంటూ నెటిజన్లు కొందరు పోస్ట్‌లు చేస్తున్నారు. ఈ పోస్ట్‌లతో అలేఖ్య పికెల్స్ ప్లేస్‌లోకి అత్తమ్మాస్ కిచెన్ ఐటమ్స్, వాటి ధరలు ట్రెండ్‌లోకి వచ్చేశాయి.

, ,
You may also like
Latest Posts from