సినిమా స్టార్ట్ కాకముందే… స్టేడియంలో స్టార్డమ్ పేలింది . ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – కోలీవుడ్ క్రేజీ మేకర్ అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న భారీ సినిమా… ఇప్పటికే సంచలనం సృష్టిస్తోంది! ఇంకా షూటింగ్ మొదలుకాకముందే… ఈ సినిమాకు మాస్ ప్రమోషన్స్‌ జోరు పుంచుకుంది. దేశవ్యాప్తంగా ప్రేక్షకుల మన్నన పొందిన బన్నీ, ఇప్పుడు గ్లోబల్ స్టేజ్ పై అడుగుపెడుతున్నాడు.

నిన్నటి హైదరాబాద్ vs ఢిల్లీ IPL మ్యాచ్‌ సమయంలో, స్టేడియం ఎల్ఈడీ స్క్రీన్స్‌ మీద ఈ సినిమాకు సంబంధించిన అనౌన్సమెంట్ వీడియో ప్రదర్శించడంతో అందరూ షాక్‌ అయ్యారు. సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలుపెట్టకముందే, ఈ స్థాయిలో ప్రమోషన్ చేయడం తెలుగు పరిశ్రమలో ఎంతో అరుదైన సంఘటన.

ఇది విన్నగానే స్పష్టమవుతుంది – సన్ పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కబోతున్న ఈ మూవీ సాధారణమైనదికాదు. అసలు ఇప్పుడు నుంచే ఈ స్థాయిలో ప్రచారం మొదలైతే, రేపు టీజర్, ట్రైలర్, రిలీజ్ టైంలో ఏ రేంజ్ రచ్చ జరిగేలా ఉందో ఊహించడమే కష్టం!

హీరోగా, విలన్‌గా – డ్యూయల్‌ రోల్‌లో అల్లు అర్జున్ నటించబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రానికి అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కాంబినేషన్ పేరు వినగానే దేశవ్యాప్తంగా సినిమా ప్రేమికుల్లో ఆసక్తి తారాస్థాయికి చేరింది. వేసవికి తర్వాత షూటింగ్ మొదలవుతుందన్న వార్తలున్నా, బన్నీ–అట్లీ జోడీ ప్రస్తుతం భారీ స్థాయిలో ప్రీ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమై ఉంది.

టెస్ట్ షూట్స్, లుక్ ట్రాన్స్‌ఫర్మేషన్

జూన్‌లో టెస్ట్ షూట్స్ జరుగనున్నాయి. Meanwhile, యుఎస్‌లోని ఓ స్పెషల్ టీమ్, విజువల్ ఎఫెక్ట్స్ & ప్రీ-విజులైజేషన్ పనుల్లో డీప్‌గా పనిచేస్తోంది. ఈ అవుట్‌పుట్‌ అట్లీ, బన్నీకి ఇంప్రెస్ చేయాలి అన్నదే ప్రాథమిక లక్ష్యం.

అల్లు అర్జున్ పాత్రల కోసం ప్రత్యేకమైన లుక్ తయారవుతోంది. దానికి కనీసం 3-4 నెలలు టైమ్ పడనుంది. ఈ మిషన్‌ను బ్రిటిష్ ఫిట్‌నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ పర్యవేక్షిస్తున్నాడు.

,
You may also like
Latest Posts from