మొత్తానికి అల్లు అర్జున్ క్రేజ్ హాలివుడ్ మ్యాగజైన్ కవర్ దాకా పాకింది. భారీ పీఆర్ తోనే ఇది సాధ్యం. తన ప్రస్తానాన్ని నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ స్దాయి దాకా తేవటంలో బన్ని సక్సెస్ అవుతన్నారు. పుష్ప 2 తో దేశం మొత్తం ఆయన గురించి మాట్లాడింది. ఇప్పుడు మెల్లిగా ప్రపంచ వ్యాప్తంగా తన సినిమాలకు మార్కెట్ చేసుకునేందుకు కానూ ఇవన్నీ ఉపయోగపడతాయి.

ఏదైమైనా తెలుగు స్టార్ అల్లు అర్జున్ కు ఇది అరుదైన గౌరవమే. ప్రఖ్యాత హాలీవుడ్ సినిమా వార్తల మ్యాగజైన్ ‘ది హాలీవుడ్ రిపోర్టర్’ ఇప్పుడు ది ‘హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ పేరిట భారత్ లోనూ అలరించనుంది.

భారత్ లో ఈ మ్యాగజైన్ తొలి సంచికను అల్లు అర్జున్ ముఖచిత్రంతో తీసుకువస్తుండడం విశేషం. అల్లు అర్జున్: ది రూల్ పేరిట కవర్ పేజీ కథనం కూడా రూపొందించారు. అల్లు అర్జున్ హీరోగా తెలుగులో తీసిన పుష్ప-2 చిత్రం హిందీ సినిమా చరిత్రను తిరగరాసిందని ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా పేర్కొంది.

అల్లు అర్జున్ ను స్టార్ ఆఫ్ ఇండియా అని అభివర్ణించింది. అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప-2: ది రూల్ చిత్రం వరల్డ్ వైడ్ రూ.1,871 కోట్లు వసూలు చేసి భారతీయ సినీ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదు చేసింది.

,
Latest Posts from