సుమంత్ హీరోగా సన్నీ సంజయ్ తెరకెక్కించిన చిత్రమే ‘అనగనగా’. రాకేశ్ రెడ్డి గడ్డం, రుద్ర మదిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. కాజల్ చౌదరి కథానాయిక. మాస్టర్ విహర్ష్, శ్రీనివాస్ అవసరాల, అను హాసన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఇటీవలే ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో (ETV Win) విడుదలై మంచి ఆదరణ దక్కించుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ దర్శకుడుకి వరస ఆఫర్స్ మొదలయ్యాయి.
ఇక డైరెక్టర్ సన్నీ సంజయ్ పేరు ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం దద్దరిల్లేలా చేస్తోంది. వెబ్ ప్రాజెక్ట్‌తో మొదలైన ఈ ప్రయాణం, థియేటర్స్ దాకా వచ్చింది. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలు, టాప్ బ్యానర్స్, టాలెంటెడ్ నటులంతా అతనిపైన దృష్టి పెట్టారు. అనగనగా కథతోనే దర్శకుడిగా అతని ప్రయాణం ఒక అద్భుతమైన మలుపు తిప్పిందనే చెప్పాలి!
అతనికివచ్చిన ఆఫర్స్ చూస్తే… ETV Winకి మరో ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడు, అది వచ్చే ఏడాది మొదలవుతుంది. అంతేకాకుండా అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కోసం కూడా ప్రాజెక్టులు సైన్ చేశారు.
సుమంత్ తన కుటుంబ సభ్యులకు సినిమా చూపించి, వారికి నచ్చడంతో అన్నపూర్ణ స్టూడియోస్ సన్నీకి అడ్వాన్స్ చెల్లించింది.
టాలెంటెడ్ దర్శకులను ముందుగా గుర్తించడంలో క్రీయాశీలంగా ఉండే నిర్మాత ఎస్ నాగవంశీ కూడా సన్నీకి అడ్వాన్స్ ఇచ్చారు.
ఇక తాజాగా హీరో అడివి శేష్ సోషల్ మీడియాలో ప్రకటిస్తూ, “సన్నీ సంజయ్ ఆసక్తికరమైన కథ తీసుకొస్తే, తప్పకుండా కలిసి పనిచేస్తా” అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారు.
ETV Win డిజిటల్ ప్లాట్‌ఫామ్ పైన తక్కువ బడ్జెట్‌లో రూపొందించిన వెబ్ ప్రాజెక్టులు ఇటీవల మంచి పేరు తెచ్చుకున్నాయి. ముఖ్యంగా “90s” , “Veeranjaneyulu Vihara Yatra” లాంటివి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాయి. తాజాగా మే 15న ETV Winలో స్ట్రీమింగ్‌కు వచ్చిన సుమంత్ నటించిన “అనగనగా…” అనేది ఈ జాబితాలో మరో పెద్ద హిట్ గా నిలిచింది.
ఈ ఎమోషనల్ డ్రామా, ప్రస్తుత విద్యా వ్యవస్థపై గాఢమైన సందేశాన్ని ఇచ్చే విధంగా రూపొందించబడింది. ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. సన్నీ సంజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమంత్, కాజల్ చౌదరి, విహర్ష్ ముఖ్య పాత్రల్లో కనిపించారు.