ఒకప్పుడు జబర్దస్త్ యాంకర్, ఇప్పటి సినిమా నటి అనసూయ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అటు సినిమాలు.. ఇటు టీవీ షోలతో ఫుల్ బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియాని ఎంగేజ్ చేయటం మాత్రం మానదు అనసూయ. సోషల్ మీడియాలోనూ యమా యాక్టివ్‌గా ఉంటూ, తరచుగా ఆమె ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంది.
తాజాగా ఆమె వర్కౌట్‌కి సంబంధించిన ఓ వీడియో వదిలింది. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
ఫేస్ బుక్‌లో అనసూయకు 5.9 మిలియన్లు.. ఇన్‌స్టాగ్రామ్‌లో 1.6 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారంటే ఇలాంటి వీడియోలు, ఫొటోలు వల్లే అనేది కాదనలేని సత్యం.
అనసూయ తన అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి ఎలాంటి వర్కౌట్స్ చేస్తుందో వీడియో వదిలింది. కేవలం వర్కౌట్స్ మాత్రమే కాదు.. ఇంటి ముందు ముగ్గుపెట్టి.. తెలుగింటి ఆడపడుచు అనిపించింది.
ఏదైమైనా అనసూయ నాలుగు పదుల వయసులో కూడా రచ్చ రచ్చ చేస్తోంది. అందుకు ఇలాంటి వర్కౌట్స్ కారణం అంటే కాదనలేం.