వెంకటేశ్‌ (Venkatesh) హీరో గా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) బాక్సాఫీస్‌ వద్ద రికార్డు వసూళ్లు రాబడుతున్న సంగతి తెలిసిందే. విడుదలై వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.203+ కోట్లు వసూలు (Sankranthiki Vasthunnam Collections) చేసినట్లు చిత్ర టీమ్ ప్రకటించింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటి వివరాలు బయిటకు వచ్చాయి.

ఈ చిత్రం ఓటిటి, శాటిలైట్ రైట్స్ ని Zee Group/ZEE5 వారు భారీ రేటుకు కొనుక్కున్నారు. ఈ సినిమా ఓటిటిలోకి ఆరు వారాల తర్వాత రాబోతోంది.

ఐశ్వర్య రాజేశ్‌, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ ఏడాది పెద్ద పండగకు వచ్చిన సినిమాల్లో చివరన విడుదలైన ఈ చిత్రం వసూళ్లలో మాత్రం అన్నింటి కంటే ముందు ఉంది. ముఖ్యంగా ఫ్యామిలీ ప్రేక్షకులు సినిమా చూసేందుకు థియేటర్‌కు క్యూ కడుతున్నారు.

అమెరికాలోనూ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటివరకూ 2.3 మిలియన్‌ డాలర్లకు పైగా వసూలు చేసింది. వెంకటేశ్‌, అనిల్‌ రావిపూడి, వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేసింది.

సంక్రాంతి సెలవులు పూర్తయినా తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీకి ఆక్యుపెన్సీ ఏమాత్రం తగ్గడం లేదు. రామ్‌చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’కే కేటాయించిన చాలా స్క్రీన్‌లలో ఈ మూవీని ప్రదర్శిస్తున్నారు. మరోవైపు ఈ వారం కూడా బాక్సాఫీస్‌ వద్ద క్రేజీ చిత్రాలేవీ లేకపోవడం వెంకటేశ్‌ మూవీకి కలిసొచ్చే అంశం.

, , , , ,
You may also like
Latest Posts from