సినిమా వార్తలుసోషల్ మీడియా

అనుపమ పరమేశ్వరన్‌కి సోషల్ మీడియాలో షాక్! 20 ఏళ్ల అమ్మాయి చేసిన పనేంటో తెలుసా?

టాలీవుడ్‌లో ‘బైసన్’, ‘ది పెట్ డిటెక్టివ్’ సినిమాలతో ఇటీవలే ప్రేక్షకులను పలకరించిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌ ఇప్పుడు మరో కారణంతో హాట్ టాపిక్‌ అవుతోంది. ఆమె తన ఫోటోలు, పేరు దుర్వినియోగం చేసిన ఓ నెటిజన్‌పై లీగల్ కేసు వేసింది.

ఇటీవలి రోజుల్లో అనుపమ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించడంతో, అభిమానులు షాక్ అయ్యారు. కొందరు నెటిజన్లు మార్ఫ్ చేసిన ఫోటోలు, తప్పుడు ఆరోపణలతో పోస్టులు చేస్తూ, ఆమె పరిచయస్తులను కూడా ట్యాగ్‌ చేస్తున్నారని అనుపమ చెప్పింది. మొదట్లో సాధారణ ట్రోలింగ్‌గా తీసుకున్నా, తర్వాత ఆ పనితనం వెనుక ఏదో తేడా ఉందని గ్రహించింది.

కొంత పరిశోధన తర్వాత, ఈ దుష్ప్రచారానికి కారణమైనది తమిళనాడుకు చెందిన 20 ఏళ్ల అమ్మాయి అని తెలిసింది. ఆ అమ్మాయి అనేక ఫేక్‌ అకౌంట్లు క్రియేట్‌ చేసి, అనుపమను టార్గెట్‌ చేసిందట. దీనిపై వెంటనే అనుపమ కేరళ సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించి కేసు నమోదు చేసింది. అధికారులు ఆ యువతిని త్వరగా గుర్తించారు.

అయితే, నిజం తెలిసినా అనుపమ ఆ అమ్మాయి పేరు బయట పెట్టలేదు. “అంత చిన్న వయసులో చేసిన తప్పు ఆమె భవిష్యత్తుపై ప్రభావం చూపకూడదు” అంటూ ఆమె హ్యూమన్ టచ్ చూపించింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన తన మెసేజ్‌లో అనుపమ స్పష్టం చేసింది — “సోషల్ మీడియా అనేది మీకు ఏది కావాలంటే అది చేయడానికి లైసెన్స్ కాదు. మీరు చేసే ప్రతి పనికి ట్రేస్ ఉంటుంది. అందరూ తమ ఆన్‌లైన్ ప్రవర్తనకు బాధ్యత వహించాలి.” ఈ మెసేజ్ వైరల్ అవ్వగా, అభిమానులు ఆమె ధైర్యాన్ని, హ్యూమానిటీని ప్రశంసిస్తున్నారు.

Similar Posts