ఎన్నో ఎక్సపెక్టేషన్స్ మ‌ధ్య శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ఎదుట‌కు వ‌చ్చింది అనుష్క (Anushka Shetty) న‌టించిన ఘూటీ (Ghaati). దాదాపు ఐదు సంవ‌త్స‌రాల త‌ర్వాత క్రిష్ జాగ‌ర్ల మూడి (Krish Jagarlamudi ) ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సినిమా కావ‌డంతో మూవీపై మంచి హైప్ ఏర్ప‌డింది. ఆపై విడుద‌ల చేసిన టీజ‌ర్‌, ట్రైల‌ర్ , పాట‌లు, చేసిన ప్ర‌మోష‌న్లు సైతం సినిమాలో ఏదో ఉంది అనే టాక్ వ‌చ్చింది. అయితే, సినిమా విడుదలైన రోజు, బాక్స్ ఆఫీస్ షేర్లు ఆశించిన కంటే చాలా తక్కువగా వచ్చాయి. ఎంత తక్కువ అంటే దారుణం అని చెప్పాలి.

మొదటి రోజు కలెక్షన్స్ ఇలా దారుణంగా ఉండటం ఊహించని ట్రేడ్ ఫ్యాన్స్ షాక్‌లో ఉన్నాయి. ప్రమోషన్స్ సరిగ్గా వర్కవుట్ చేయకపోవడంతో ప్రీ రిలీజ్ బుకింగ్స్ పై ఆ ఇంపాక్ట్ బాగా కనపడింది.

అదేవిధంగా, మొదటి రోజు సినిమా మీద వచ్చిన రివ్యూలు మరియు వర్డ్-ఆఫ్-మౌత్ నెగెటివ్‌గా ఉండటం, ఘాటీ బాక్స్ ఆఫీస్ ఫలితాన్ని ఇంకా దారుణం చేసింది. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు షేర్ 1 కోట్లు కూడా దాటలేదని తెలుస్తోంది. మొత్తం బిజినెస్ బ్రేక్-ఈవెన్ కావడానికి 20 కోట్ల షేర్ అవసరం, కానీ ఇప్పుడు 5 కోట్లు షేర్ సైతం సాధ్యం కాదని అంచనాలు ఉన్నాయి.

వీకెండ్ అడ్డ్వాన్సెస్ కూడా మొదటి రోజు కంటే తక్కువగా ఉండటంతో, ఘాటీ సినిమా ఫలితం పూర్తిగా నిరాశ కలిగించేలా ఉంది.

, , , ,
You may also like
Latest Posts from