ఏపీఎస్ఆర్టీసీ బస్సులో తండేల్ సినిమా పైరసీ వీడియోను ప్రదర్శించడంపై ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు విచారణకు ఆదేశించారు. బాద్యుల పై చర్యలు తీసుకుంటామాని ఆయన తెలిపారు.

తండేల్ సినిమా బస్సులో ప్లే చేయడం సెన్సేషన్ గా మారింది. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించినా తండేల్ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆర్టీసీ బస్సులో తండేల్ పైరసీ ప్రింట్ ప్లే చేసారు. దీని పై నిర్మాతలు సీరియస్ అయ్యారు.

సినీ నిర్మాత అల్లు అరవింద్, బన్నీ వాసు సినిమాను పైరసీ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని కూడా వార్నింగ్ ఇచ్చారు. పైరసీ పెద్ద క్రైమ్‌. తండేల్ సినిమాని పైరసీ చేస్తున్న వెబ్‌సైట్స్‌, వాట్సాప్‌, టెలిగ్రామ్‌, గ్రూప్‌ అడ్మిన్‌లకు ఇదే నా హెచ్చరిక. కేసులు పెట్టాం. మీరు జైలు వెళ్లే అవకాశం ఉందని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు.

బన్నీ వాసు మాట్లాడుతూ.. కొంతమంది తెలిసి, మరికొంత మందికి తెలియక పైరసీ చేస్తున్నారు. క్రిమినల్‌ కేసు ఫైల్‌ అయితే, వెనక్కి తీసుకోలేము. యువత ఇందులో ఇరుక్కొవద్దు. ఈరోజు ప్రతిదీ ట్రాక్‌ చేయొచ్చు. మా సినిమా క్లిప్ ఒక్కటి ప్లే చేసినా కేసు పెడతాం అని బన్నీ వాసు అన్నారు.

, , , ,
You may also like
Latest Posts from