సినిమా వార్తలు

‘ధురంధర్’ దూకుడుకి బ్రేక్ పడుతుందా లేదా? ఈ రోజు తేలిపోతుంది

రణవీర్ సింగ్ నటించిన స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద ఊహించని దూకుడు చూపిస్తోంది. థియేటర్లలోకి వచ్చి దాదాపు రెండు వారాలు అవుతున్నప్పటికీ, సినిమా జోరు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా భారతదేశంలో 500 కోట్ల గ్రాస్‌ను దాటిన 17వ భారతీయ సినిమాగా ‘ధురంధర్’ రికార్డు సృష్టించింది.

ఇది 2025లో హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలుస్తుందా?

అయితే ఇప్పుడు ట్రేడ్ లో ఓ కొత్త ప్రశ్న. తాజా చిత్రం అవతార్ 3 షాక్ ఇస్తుందా… ‘ధురంధర్’ ధైర్యం తగ్గుతుందా? అని. డిసెంబర్ 19న జేమ్స్ కామెరూన్ తీసిన‘Avatar: Fire and Ash’ థియేటర్లలోకి రానుంది. భారీ పోటీ ఎదురవుతుందనే అంచనాలున్నా, ‘ధురంధర్’కి ఉన్న మౌత్ టాక్, రిపీట్ ఆడియన్స్ సినిమా రన్‌ని ఇంకా లాగుతుందనే ట్రేడ్ వర్గాల అంచనా. ఇదిలా ఉండగా, దినేష్ విజన్ ప్రొడక్షన్‌లో తెరకెక్కిన‘ఇక్కిస్’ డిసెంబర్ 25 నుంచి జనవరి 1కి వాయిదా పడటం ‘ధురంధర్’కి మరింత అడ్వాంటేజ్‌గా మారింది.

భారత్‌లో 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సినిమాలు

(ఇప్పటికే చరిత్రకు ఎక్కిన లిస్ట్)

బాహుబలి (2015) – టాలీవుడ్
దంగల్ (2016) – బాలీవుడ్
బాహుబలి 2 (2017) – టాలీవుడ్
2.0 (2018) – కోలీవుడ్
RRR (2022) – టాలీవుడ్
KGF 2 (2022) – సాండల్‌వుడ్
పఠాన్ (2023) – బాలీవుడ్
గదర్ 2 (2023) – బాలీవుడ్
జవాన్ (2023) – బాలీవుడ్
యానిమల్ (2023) – బాలీవుడ్
సలార్ (2023) – టాలీవుడ్
కల్కి 2898 AD (2024) – టాలీవుడ్
స్త్రీ 2 (2024) – బాలీవుడ్
పుష్ప 2 (2024) – టాలీవుడ్
ఛావా (2025) – బాలీవుడ్
కాంతార: చాప్టర్ 1 (2025) – సాండల్‌వుడ్
ధురంధర్ (2025) – బాలీవుడ్

2025 నెంబర్ వన్ కోసం టార్గెట్?

ప్రస్తుతం రిషబ్ శెట్టి ‘కాంతార: చాప్టర్ 1’ 2025లో హయ్యెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ ఫిల్మ్‌గా కొనసాగుతోంది. కానీ 500 కోట్ల క్లబ్‌లోకి వచ్చిన తర్వాత,‘ధురంధర్’ ఆ రికార్డ్‌ని టార్గెట్ చేస్తోంది అనే చర్చ ట్రేడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

స్టార్ కాస్ట్ + సీక్వెల్ సర్‌ప్రైజ్!

ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రణవీర్ సింగ్‌తో పాటు అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, రాకేష్ బేడీ, సారా అర్జున్ కీలక పాత్రల్లో నటించారు.

ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే…
‘ధురంధర్’ సీక్వెల్ ఇప్పటికే పూర్తయ్యింది!
రిలీజ్ డేట్:మార్చి 19, 2026
అదే రోజున యష్ ‘టాక్సిక్’తో బిగ్ క్లాష్

ఫైనల్ బజ్:

500 కోట్ల తర్వాత కూడా ఆగని దూకుడు… ‘ధురంధర్’ 2025ని పూర్తిగా కబ్జా చేస్తుందా? భాక్సాఫీస్ దగ్గర అసలు ఆట ఇప్పుడే మొదలైంది!

Similar Posts