సినిమా వార్తలు

రెండు OTTలలో ఒకేసారి ‘బాహుబలి ఎపిక్’? ఈ అనౌన్స్‌మెంట్ వెనక స్ట్రాటజీ ఏంటి?”

ఎంత ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టారో… అంత రిజల్ట్ మాత్రం రాలేదు. ‘బాహుబలి: ది ఎపిక్’ — రెండు భాగాలను కలిపి, కొత్త ఎడిట్‌తో, భారీ ప్రమోషన్‌తో విడుదలైన ఈ రీ-రిలీజ్ మొదట హైప్‌తో దూసుకుపోయినా, కలెక్షన్స్ మాత్రం ఊహించినంతగా రాలేదు.

ఫ్యాన్స్ పండగ చేసుకున్నా, కామన్ ఆడియన్స్ మాత్రం కొంచెం వెనక్కి తగ్గారు. ₹100 కోట్ల లక్ష్యంతో బరిలో దిగిన సినిమా, చివరికి ₹50 కోట్లు గ్రాస్‌ దగ్గరే ఆగిపోయింది. అయినా సరే, రీ-రిలీస్‌లలో బిగ్గెస్ట్ గ్రోసర్ గా నిలిచింది — అదే బాహుబలి బ్రాండ్ పవర్.

ఇప్పుడు థియేటర్ల తర్వాత బిగ్ స్క్రీన్ నుంచి స్మార్ట్ స్క్రీన్‌కి!

ప్రేక్షకులు ఇప్పుడు OTT రిలీజ్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఇండస్ట్రీ బజ్ ప్రకారం — ‘బాహుబలి: ది ఎపిక్’ త్వరలోనే డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టబోతోంది!

సమాచారం ప్రకారం, ఈ మూవీని Jio Hotstar మరియు Netflix రెండింటిలోనూ అన్ని భాషల్లో స్ట్రీమ్ చేయనున్నారు. రీసెంట్ టాక్ ప్రకారం — డిసెంబర్ మొదటి వారంలో స్ట్రీమింగ్ ప్రారంభం కావొచ్చని అంచనా. అధికారిక అనౌన్స్‌మెంట్ కూడా త్వరలో రానుంది.

బాహుబలి ది ఎపిక్ – ఏమి నేర్పింది?

హైప్ ఎంత ఉన్నా, కంటెంట్ ఫ్రెష్‌నెస్ ముఖ్యం. థియేటర్ క్రేజ్ తర్వాత కూడా OTT డిమాండ్ తగ్గలేదు. బ్రాండ్ బాహుబలి అంటే ఇప్పటికీ మాస్ ఎమోషన్‌నే!

“స్క్రీన్‌పై ఎంతసార్లు చూసినా బోర్ కాదు… ఇప్పుడు ఓటీటీలో మళ్లీ ఆ రాజ్యం ప్రారంభం కావాలి!”

Similar Posts