ఈ ఏడాది దసరా సెలవులు సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 5 వరకు సాగనున్నాయి. ఈ సీజన్‌లో రిలీజ్‌కి రెడీగా ఉన్న పవన్ కల్యాణ్ “ఓజీ” & బాలకృష్ణ “అఖండ 2” సినిమాలు ఫ్యాన్స్‌కి పెద్ద ట్రీట్‌గా మారబోతున్నాయి. కానీ, తాజా సమాచారం ప్రకారం “అఖండ 2” రిలీజ్ డిసెంబర్ 5కి మార్చబడింది . దీంతో దసరా హాలిడే సీజన్‌లో ఓజీకి సోలో రిలీజ్ ఛాన్స్ దొరికింది! త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. దీంతో ‘OG’కి బాక్సాఫీస్ వద్ద ఫుల్ అడ్వాంటేజ్ లభించనుంది.
సోలో రిలీజ్ + దసరా హాలిడేస్ అంటే బాక్సాఫీస్ వద్ద భారీ బెనిఫిట్. కేవలం పాజిటివ్ టాక్ వస్తే చాలు, “ఓజీ” కలెక్షన్స్ రికార్డులు సృష్టించగలదనేది నిజం.
అలాగే, ఈ సినిమా ఇప్పటివరకు తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక ప్రీ-రిలీజ్ బిజినెస్ చేస్తూ, పాన్-ఇండియా బిగ్గీలను సైతం దాటేసింది. థియేట్రికల్ రైట్స్‌కి భారీ డిమాండ్ ఉంది.
సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటించింది. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. ‘OG’ సెప్టెంబర్ 25న విడుదల కానుంది.
దసరా బాక్సాఫీస్‌ను పవర్‌స్టార్ “ఓజీ” ఏకపక్షంగా దున్నేస్తాడనేది ఇప్పుడు అభిమానుల నమ్మకం.