అన్నపూర్ణ వంటి పెద్ద సంస్దలో ఉద్యోగం వస్తుందంటే ఎవరికైనా ఆశపుడుతుంది. దాన్ని కొంతమంది క్యాష్ చేసుకుందామని ప్రయత్నిస్తున్నారు. ఫ్రాడ్ పనులుకు పాల్పడుతున్నారు. అయితే అవన్నీ రూమర్స్ అని, ఫేక్ వార్తలు అని ఎవరినీ నమ్మవద్దని అన్నపూర్ణా స్టూడియోస్ స్వయంగా ప్రకటించింది.
అన్నపూర్ణ స్టూడియోస్ లో పని చేసేందుకు జాబ్ ఆఫర్స్ అంటూ కొన్ని ఫేక్ వార్తలు ప్రచారం జరుగుతున్నాయి అని వాటిని ఎవరూ నమ్మొద్దు అంటూ చెబుతున్నారు.
Beware of Fraudulent Job Offers!
— Annapurna Studios (@AnnapurnaStdios) March 27, 2025
Certain individuals are falsely claiming to be associated with Annapurna Studios and are deceiving aspiring actors and technicians with fake job offers in exchange for money. Please note – Annapurna Studios DOES NOT charge any fee for auditions,… pic.twitter.com/fLi98LKojc
నటీనటులు, టెక్నీషియన్స్ గా తీసుకునేందుకు మా పేరిట కొందరు తప్పుడు ఆఫర్స్ ఇస్తున్నారు అందరూ గుర్తుంచుకొండి అన్నపూర్ణ స్టూడియోస్ ఎప్పుడూ ఎవరి దగ్గరా డబ్బులు ఛార్జ్ చేయదు అని క్లారిటీ ఇచ్చారు.
ఆడిషన్స్ అయినా మరే అంశాల్లో అయినా కూడా తాము డబ్బులు తీసుకోము అంటూ తెలిపారు. ఎవరికైనా తప్పుడు సంప్రదింపులు వస్తే తమ మెయిల్ ద్వారా తమని రీచ్ అవ్వొచ్చని చెబుతూ జాగ్రత్తగా ఉండమంటున్నారు.