
టాలీవుడ్‌లో ఇప్పుడు హీరోల పుట్టినరోజులు అంటే సాధారణ రోజు కాదు — అది సెలబ్రేషన్ డే! ప్రతీ ఫ్యాన్‌బేస్ తమ హీరో బర్త్‌డేను ఒక ఫెస్టివల్‌లా జరుపుకుంటుంది. బ్యానర్లు, కేకులు, సోషల్ మీడియాలో ట్రెండ్స్ — ఇవన్నీ కేవలం వార్మప్ మాత్రమే! అసలు ఎక్సైట్‌మెంట్ మాత్రం “ఏం అప్‌డేట్ వస్తుందా?” అనే ప్రశ్న చుట్టూ తిరుగుతుంది.
ఒక టైటిల్ పోస్టర్ అయినా, ఒక సాంగ్ టీజర్ అయినా, లేదా హీరో కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ అయినా — ఫ్యాన్స్‌కి అది గిఫ్ట్ ఆఫ్ ది ఇయర్!
ఇక ఈసారి స్పాట్‌లైట్ అంతా ఒకే హీరో మీదే — రెబల్‌స్టార్ ప్రభాస్!
అక్టోబర్ 23న రెబల్‌స్టార్ ప్రభాస్ జన్మదినం సందర్భంగా అభిమానులు భారీ అప్‌డేట్స్ కోసం ఆతృతగా వేచి ఉన్నారు. ఆయన నటిస్తున్న ‘రాజా సాబ్’ చిత్రానికి చెందిన ఫస్ట్ సింగిల్ బర్త్‌డే రోజునే విడుదల కానుందని సమాచారం! ఈ చిత్రం 2026 జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ కానుంది.
ఇక మరో పక్క, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ కొత్త సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ కూడా అదే రోజున జరగనున్నట్టు బజ్.
అయితే అభిమానులను ఇంకా ఎక్కువ ఎగ్జైట్ చేస్తున్న ప్రాజెక్ట్ — సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారని చెప్పడమే అభిమానుల్లో హిస్టీరియా సృష్టిస్తోంది. కానీ ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్ రాలేదు.
సందీప్ రెడ్డి వంగా ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి దశకు చేర్చాడు. ఇప్పుడు ప్రభాస్ అందుబాటులోకి రావడమే మిగిలింది. ఈ ఏడాదిలోనే సినిమా షూట్ ప్రారంభం కానుంది అని ఇండస్ట్రీ టాక్.
ఇక ప్రస్తుతం ప్రభాస్ యూరప్‌లో పాట షూట్ లో బిజీగా ఉన్నారు. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా తన బర్త్‌డేను యూరప్‌లోనే సెలబ్రేట్ చేసుకోబోతున్నారట. అక్టోబర్ చివర్లో హైదరాబాద్‌కు తిరిగి వచ్చే అవకాశముంది.
“రాజా సాబ్ సాంగ్ నుండి స్పిరిట్ అప్‌డేట్ వరకు – ఈ బర్త్‌డేకు ప్రభాస్ ఫ్యాన్స్ కోసం డబుల్ ట్రిట్ రెడీనా?”
