2016లో “పెళ్ళి చూపులు” చిన్న సినిమాగా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది. విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్ ఈ సినిమాతో ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్ చేయగా, వారి కాంబినేషన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
ఈ కాంబో మరోసారి కలవాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ, అద్భుతమైన సక్సెస్ తర్వాత వీళ్ళ కాంబో మళ్లీ రకరకాల కారణాలతో రిపీట్ కాలేదు, కానీ త్వరలో ఈ ప్రాజెక్టు మొదలు కానుంది. ఆ డిటేల్స్ చూద్దాం.
విజయ్, తరుణ్ భాస్కర్ చాలా కాలం క్రితం GA2 Pictures బ్యానర్‌పై తమ కొత్త ప్రాజెక్టుకు సైన్ చేసినప్పటికీ, అనేక కారణాల వల్ల ఈ ప్రాజెక్టు లేట్ అవుతూ వచ్చింది. మరో ప్రక్క తరుణ్ భాస్కర్ కొన్ని కొత్త స్క్రిప్ట్స్ పై పని చేస్తున్నాడు, అలాగే విజయ్ కూడా బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఇద్దరూ తన కమిట్‌మెంట్స్‌ను పూర్తి చేసి, ఈ ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.
అయితే, అల్లు అరవింద్ , బన్నీ వాస్ నిర్మాతగా ఉండే ఈ సినిమాకు విజయ్ దేవరకొండ రెండు ఇతర ప్రాజెక్టుల పూర్తయ్యే తర్వాతే వచ్చే అవకాశం ఉందని సమాచారం.
మరికొన్ని ఇంట్రస్టింగ్ అప్‌డేట్స్ త్వరలోనే రాబోతున్నాయి!