శంకర్ టైమ్ ఏమీ బాగున్నట్లు లేదు. గేమ్ ఛేంజర్ రిలీజ్ ముందు నుంచి నెగిటివిటీ ఏదో విధంగా కనపడుతోంది. ముఖ్యంగా ఈ చిత్రంలో పాటల కోసం 75 కోట్లు ఖర్చు పెట్టాను అని దిల్ రాజు కూడా గొప్పగా చెప్పుకున్నాడు. కానీ ఏ ఒక్క పాట కూడా ఆడియెన్స్ చేత ఉర్రూతలూగించలేకపోయిందనేది నిజం. ఆ జరగండి పాట బయిటకు వచ్చిన దగ్గర నుంచి జనాలు చీల్చి చెండాడుతున్నారు. జరగండి పాట లీక్ అయిన క్షణం నుంచి ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు.
సంక్రాంతి కానుకగా బాక్సాఫీసు ముందుకొచ్చిన ఈ సినిమాలోని ‘జరగండి’ (Jaragandi song full video) వీడియో సాంగ్‌ను టీమ్ తాజాగా విడుదల చేసింది. ప్రభుదేవా కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో 600 మంది డ్యాన్సర్లు పాల్గొన్నారు. ఆ పాటపై ట్రోలింగ్ ఈ విధంగా సాగుతోంది.
అయితే ప్రభు దేవా కొరియోగ్రఫీ మార్క్ కనిపించలేదు. ఒక్క సరైన హుక్ స్టెప్ లేదు. ఇక గ్రాండ్‌గా వేసిన సెట్ మాత్రం కనిపించింది. కానీ సినిమాకు ఇదేమీ కలిసి రాలేదు.
రామ్ చరణ్ లాంటి వాడ్ని పెట్టుకుని సరైన స్టెప్పులు కూడా ప్రభుదేవా కంపోజ్ చేసుకోలేకపోయాడు.
ఈ సెట్‌ను దిల్ రాజు ఫాం హౌస్‌లో వేసిన సంగతి తెలిసిందే. పొలంలో వేసిన ఈ సెట్ విజువల్స్ ఇప్పుడు బయటకు వచ్చాయి.
వీఎఫ్ఎక్స్ యాడ్ చేయకముందు జరగండి సెట్ ఎంత నేచురల్‌గా ఉందో చూసి షాక్ అవుతున్నారు.
ఏదైమైనా గేమ్ ఛేంజర్‌లో కొన్ని మంచి పాటలు, మంచి సీన్లు ఉన్నాయి. కానీ అవేవీ కూడా జనాలు రివీస్ చేసుకునే స్థితిలో లేరు.