‘ల‌వ్ టుడే’తో తెలుగువారిని సైతం ఆకట్టకున్నారు హీరో ప్రదీప్ రంగ‌నాథ‌న్‌. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘రిట‌ర్న్ ఆఫ్ ది డ్రాగ‌న్‌’ (return of the dragon). అశ్వత్ మారిముత్తు ద‌ర్శక‌త్వంలో వచ్చిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్. రీసెంట్ గా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తెలుగులోనూ మంచి కలెక్షన్స్ వసూలు చేసింది.

ఇప్పుడు ఈ మూవీ ఓటిటి వేదికగా అడుగుపెట్టబోతుంది.మార్చి 21 నుంచి నెట్ ఫ్లిక్స్(Net Filx)లో తెలుగు,తమిళ,మలయాళ,కన్నడ,హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

గత కొన్ని రోజుల నుంచి డ్రాగన్ ఓటిటి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.దీంతో డ్రాగన్ ఎప్పుడెప్పుడు ఓటిటి లోకి వస్తుందా అని అన్ని భాషలకి చెందిన సినీ అభిమానులు ఎదురుచూస్తుఉన్నారు.ఈ నేపథ్యంలో తాజా వార్త వాళ్ళల్లో ఆనందాన్ని తీసుకొచ్చిందని చెప్పవచ్చు.

, , , ,
You may also like
Latest Posts from