గతేడాది హిందీలో విడుదలైన ‘కిల్’ (Kill) చిన్న సినిమానే అయినా… బాక్సాఫీస్ వద్ద బిగ్ సర్ప్రైజ్ అందించిన సంగతి తెలసిందే. థియేటర్‌లో ప్రెజెంట్ చేసిన బ్లడీ యాక్షన్, ఓన్ లొకేషన్ స్టంట్‌లు, రా విజువల్స్ — ప్రేక్షకులను షాక్‌కి గురిచేశాయి. జులై 5న రిలీజ్ అయిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు కలెక్షన్ల పరంగా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.అసలైన సక్సెస్ అంటే ఎలా ఉంటుందో ఈ సినిమానే రుజువు చేసింది.

లక్ష్య లాల్వానీ, తాన్య మనక్తల, రాఘవ్ జుయల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని నిఖిల్ నాగేశ్ భట్ దర్శకత్వం వహించగా, ధర్మా ప్రొడక్షన్స్ నిర్మించింది. సీనియర్ నటుడు ఆశిష్ విద్యార్థి కీలక పాత్రలో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఫైట్ సీన్స్‌కి థియేటర్లలో చప్పట్లు ఆగలేదు.

ఈ క్రమంలో ఈ సినిమా రీమేక్ విషయంలో తెలుగు & తమిళ పరిశ్రమలు దృష్టిసారించాయి. ఎప్పటినుంచో డైరెక్టర్ రమేష్ వర్మ ఈ రీమేక్‌ను తెరకెక్కించనున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

మొదట్లో ఈ సినిమాలో వరుణ్ తేజ్ హీరోగా నటించబోతున్నారని ప్రచారం జరిగింది. కానీ వరుణ్ ప్రస్తుతం ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో, ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ఆ స్థానంలో ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎంపికైయ్యాడట.

ఇంతకముందు రమేష్ వర్మ – బెల్లంకొండ కాంబినేషన్‌లో వచ్చిన ‘రాక్షసుడు’ మంచి విజయాన్ని నమోదు చేసింది. తర్వాత ‘రాక్షసుడు 2’ కూడా అనౌన్స్ చేశారు కానీ, అది సెట్స్‌ మీదకు వెళ్లక ముందే ఆగిపోయింది.

ఇప్పుడు ‘కిల్’ రీమేక్ వీరిద్దరి కాంబినేషన్‌లోనే రాబోతుందని ఫిక్స్ అయ్యింది. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతుంది.
తమిళ వెర్షన్‌లో హీరోగా విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ నటించనున్నట్లు టాక్. ఈ క్రేజీ యాక్షన్ థ్రిల్లర్ ఇద్దరు యువ హీరోల కెరీర్‌కు కీలక మలుపుగా మారే అవకాశముంది.

, ,
You may also like
Latest Posts from