ఓటిటిలు వచ్చాక చిన్న సినిమా లకు, వైవిధ్యమైన కథలకు కొండత బలం వచ్చింది. నిజాయితీగా కథ చెప్పాలే కానీ హీరో లేకపోయనా, ఎలాంటి కథైనా, చెప్పవ్చు. అయితే ఆ కథ అద్బుతంగా ఉండాలి. అదే క్రమంలో ఫ్యామిలీ డ్రామాతో పాటు సోషల్ కామెంటరీ జోడిస్తూ ఈ కథ రాసుకున్నాడు దర్శకుడు. అందులోనూ బ్రహ్మానందం కూడా ఉండటంతో క్రేజ్ క్రియేట్ అయ్యింది. ఎమోషనల్ రైడ్ గా సాగిన ఈ కథ ప్రేక్షకుడిని హత్తుకుందా?

స్టోరీ లైన్

బ్రహ్మ (రాజా గౌత‌మ్) ఓ థియేటర్ ఆర్టిస్ట్. ఈ రోజుల్లో నాటకాలికి పెద్ద విలువ లేదు. దాంతో అతనికి సినిమా నటుడు కావాలనేది లక్ష్యంగా పెట్టుకుంటాడు. అయితే అతనికి ఆ అవకాసం ఇచ్చేవాళ్లు ఎవరూ కనపడరు. ఈ క్రమంలో దిల్లీలో జ‌ర‌గ‌నున్న క‌ళారంగ్ మ‌హోత్సవంలో నాట‌కం వేసే అవకాసం వస్తుంది. అయితే అందుకు రూ.6 ల‌క్షలు కట్టాలి. అయితే డబ్బు కోసం చేసిన ప్రయత్నాలు ఏమీ వర్క్ అవుట్ కావు. ఆ సమయంలో వృద్ధాశ్రమంలో ఉండే త‌న‌ తాత ఆనంద రామ్మూర్తి (బ్రహ్మానందం) సీన్ లోకి వస్తాడు.

కోదాడ ద‌గ్గర ఆరెక‌రాల భూమి తన పేరు మీద ఉంద‌ని, తాను చెప్పిన‌ట్లు చేస్తే అది త‌న‌కు ఇస్తాన‌ని చెప్పి ఊరుకి తీసుకెళ్తాడు ఆనంద రామ్మూర్తి. అయితే ఆ డబ్బు ఇవ్వటం కోసం కొన్ని కండీషన్స్ పెడతారు. ఆ తర్వాత ఏమైంది ? అసలు ఆనంద రామ్మూర్తి వృద్ధాశ్రమంలో ఎందుకు ఉండాల్సి వచ్చింది? జ్యోతి (తాళ్లూరి రామేశ్వరి) పాత్రకు ఈ కథలో ప్రాధాన్యత ఏమిటి? చివరికి బ్రహ్మ కోరిక తీరిందా? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

సినిమా కథ ఇలానే ఉండాలనే రూల్ ఏమీ లేదు కానీ ఖచ్చితంగా కథ ఆసక్తి కలిగించేలా ఉండాలనేది కండీషన్. బ్రహ్మానందం ని చూపిస్తూ ఆయన చుట్టూనే కొన్ని పాత్రలు వాటి మధ్య సంఘర్షణని చిత్రీకరించాలని చూశాడు. అంత వరకూ ఈ ఆలోచన బావుంది. ఆ సన్నివేశాలు, పాటలు ఫీల్ గుడ్ గానే వచ్చాయి. అయితే ఈ పాయింట్ చుట్టూ రాసుకున్న ఆరు వేలు అవసరం అనే సోషల్ కామెంటరీ, జాలి-ప్రేమ మధ్య లాంటి సున్నితమైన లేయర్లు ఇందులో అంతగా ఇమడలేదనే చెప్పాలి.

ఇది తెలుగు సినిమా అయినప్పటికీ కథా గమనంలో మలయాళ సినిమాల ఛాయలు కనిపిస్తాయి. ఒకొక్క పాత్ర, ఆ పాత్రల స్వభావాన్ని ఆకళింపు చేసుకోవడానికి ప్రేక్షకుడికి కాస్త సమయం పడుతుంది. నిజానికి ఇది సీరియస్ కథ.. కానీ దర్శకుడు దీనికి హాస్యాన్ని జోడిస్తూ ఆహ్లాదకరమైన సన్నివేశాలతో ముందుకు తీసుకెళ్లాలని అనుకున్నాడు. అయితే అది వికటించింది. ఆ ఫీల్ పండలేదు. ఫన్ పండలేదు.

అలాే తెర‌పై బ్రహ్మానందం ఉన్నాడు కాబ‌ట్టి, త‌న కామెడీ టైమింగ్ తో కొద్దో గొప్పో.. ఫన్ పుట్టించ‌గ‌లిగాడని భావిస్తాం. కానీ అదే జరగలేదు. మొదటి స‌గంలో అక్క‌డ‌క్క‌డైనా ఈ క‌థ‌ని భ‌రించొచ్చు. సెకండాఫ్ కు వ‌చ్చేస‌రికి బ్రహ్మి కూడా ఏమీ చేయ‌లేక‌పోయాడు.డైరక్టర్ కు ఈ ఎమోషనల్ రైడ్ ని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాలేదు.అంత‌ర్లీనంగా ఓ సందేశం ఇస్తున్నాను,క్లాస్ ఫిల్మ్ తీస్తున్నా అనుకుని ద‌ర్శ‌కుడు సినిమాలో ఏమి లేకుండా చేసేసాడు.

ఎవరెలా చేసారంటే..

తాత పాత్రలో చేసిన బ్రహ్మానందం హ్యుమర్ బావుంది. హీరో ప్రెండ్ గా కనిపించిన వెన్నెల కిషోర్ కొన్ని చోట్ల బాగానే నవ్విస్తాడు. ఉన్నంతలో త‌ను ఈ సినిమాకు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌. అలాగే సినిమా ప్రొడక్షన్ వైజ్ క్వాలిటీ గా బాగుంది. పాట‌లు వింటున్న‌ప్పుడు ఓకే అనిపిస్తాయి. లెంగ్త్ ప‌రంగా సినిమా చిన్నదే. కామెడీ సినిమా చూడ‌బోతున్నాం అని ప్రేక్ష‌కులు ఫిక్స‌య్యాక‌… వాళ్ల‌ని న‌వ్వించ‌డం ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు. ఆ స్థాయిలో న‌వ్వించే స‌త్తా ఈ స్క్రిప్టులో లేక‌పోయింది. దాంతో ‘బ్రహ్మా ఆనందం’ కాస్త బోరింగ్ గా త‌యారైంది.

కెమెరాపనితనం, ఎడిటింగ్, నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా వున్నాయి. ఎలాంటి అసభ్యత లేకుండా క్లీన్ గా సినిమా తీయడం మరో మెచ్చుకోదగ్గ విషయం. కాకపోతే చిన్న సినిమాలకి, స్టార్స్ లేని సినిమాలకి క్రౌడ్ ఫుల్లర్.. కంటెంటే. మ‌రి ఈ కంటెంట్ తో జ‌నాల్ని థియేట‌ర్ల వ‌ర‌కూ ర‌ప్పిస్తారా, లేదా? అనేది చూడాలి.

చూడచ్చా

ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఆశించకుండా, కాస్త ఓపిక తెచ్చుకొని ఓ లైటర్ వెయిన్ సినిమా చుడాలనుకునే ప్రేక్షకులకు ‘బ్రహ్మా ఆనందం’ కాలక్షేపాన్ని ఇస్తాడు.

, , , , ,
You may also like
Latest Posts from