వెంకటేష్, చిరంజీవి ఒకే స్క్రీన్‌పై కలసి డ్యాన్స్ చేస్తే.. ఆ మాస్, క్లాస్ ఎంజాయ్‌మెంట్ ఏ రేంజిలో ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే జరగబోతోందన్న న్యూస్ బయటికి రావడంతో అభిమానుల్లో హంగామా మొదలైంది. వివరాల్లోకి వెళితే…

మెగాస్టార్ చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న “మన శంకర వర ప్రసాద్ గారు” టైటిల్ అనౌన్స్‌మెంట్‌కి అప్పుడే భారీ రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ అయిన గ్లింప్స్‌లో చిరంజీవి వింటేజ్ లుక్‌లో అలరించి, ఫ్యాన్స్‌కి పండగ వాతావరణం క్రియేట్ చేశారు.

చాలా రోజుల తర్వాత చిరు మళ్లీ ఫుల్ లెంగ్త్ కామెడీ ట్రాక్‌లో కనిపించబోతుండటం మరో హైలైట్. అసలే చిరంజీవి కామెడీ టైమింగ్ అంటే ప్రేక్షకులు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. ఈసారి అనిల్ రావిపూడి స్టైల్ ఎంటర్టైన్‌మెంట్‌తో అది బ్లాక్‌బస్టర్ పంచ్ అవుతుందనే నమ్మకం ఉంది.

ఇక, ఈ ఎంటర్టైనర్‌లో వెంకటేష్ స్పెషల్ రోల్ చేస్తున్నారు. వచ్చే అక్టోబర్ నుంచి షూటింగ్‌లో జాయిన్ అవబోతున్న వెంకీ.. నెల రోజుల్లో తన పార్ట్ పూర్తి చేస్తారు. దాదాపు 30 నిమిషాల స్క్రీన్ టైమ్ ఉంటుందని సమాచారం. అందులో భాగంగానే చిరంజీవి – వెంకటేష్ ఇద్దరూ కలిసి ఒక సెలబ్రేషన్ సాంగ్‌లో డ్యాన్స్ చేయబోతున్నారని వినిపిస్తోంది. ఈ న్యూస్ విన్న వెంటనే ఫ్యాన్స్ రేంజ్ మరింత పెరిగిపోయింది.

ఈ భారీ మల్టీస్టారర్ ఎంటర్టైనర్‌ను షైన్ స్క్రీన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. సంక్రాంతి 2026 కి సినిమాను రిలీజ్ చేయాలనే టార్గెట్‌తో షూటింగ్ స్పీడ్ పెంచుతున్నారు.

చిరంజీవి – వెంకటేష్ కాంబో సెలబ్రేషన్ సాంగ్… ఫ్యాన్స్‌కి ఈసారి థియేటర్స్‌లో నిజంగానే ఫెస్టివల్ లా మారబోతోందని చెప్పొచ్చు!

, , , ,
You may also like
Latest Posts from