చిరంజీవి జన్మదిన సందర్భంగా రీ-రిలీజ్ చేసిన స్టాలిన్ 4K ఊహించని రీతిలో బోల్తా పడింది.

ఫ్యాన్స్ గ్రాండ్‌గా ప్లాన్ చేసిన ఈ రీ-రిలీజ్ షోస్‌కు ప్రేక్షకుల నుంచి అసలు రెస్పాన్స్ రాలేదు. కొన్ని షోల్లో మాత్రమే ఓకే ఆక్యుపెన్సీ కనపడగా… మిగతావి ప్రేక్షకులు లేకపోవడంతో మొదలుకాకముందే క్యాన్సిల్ అయ్యాయి. అదీ కాదు, అదనపు షోలు వేయాలన్న డిమాండ్ కూడా రాలేదు.

ఇక అసలు షాకింగ్ ఏమిటంటే… రీ-రిలీజ్ అనౌన్స్ చేసినప్పుడే మెగా అభిమానుల్లో కూడా పెద్ద ఎగ్జైట్‌మెంట్ కనపడలేదు.

2006లో ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన స్టాలిన్ అప్పట్లో కూడా యావరేజ్ రిజల్ట్‌ మాత్రమే సాధించింది. కానీ, 2025లో రీ-రిలీజ్ అయ్యాక పూర్తిగా ఔట్‌రైట్ ఫెయిల్యూర్ !

“మెగాస్టార్ సినిమాకి ఇలా జరగటమేంటి?” అనేది ఇప్పుడు నెటిజన్ల చర్చ.

, , , , ,
You may also like
Latest Posts from