ఇండిపెండెన్స్ డే లాంగ్ వీకెండ్ రెస్క్యూ చేయకపోతే, కూలీ – వార్ 2 రెండూ సెకండ్ డే నుంచే కూలిపోయేవి అనడంలో ఎటువంటి సందేహం లేదు. మిశ్రమ సమీక్షలు వచ్చినా, కృష్ణాష్టమి సెలవు రెండు సినిమాలకు లైఫ్ ఇచ్చింది.

రజనీ పవర్ మరోసారి!

రజనీకాంత్ కూలీ బాక్సాఫీస్‌ను ఏకపక్షంగా డామినేట్ చేస్తోంది. మొదటి రెండు రోజుల్లోనే 245 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ యాక్షన్ డ్రామా, మూడో రోజున (శనివారం) కూడా 80 కోట్ల దగ్గర క్లోజ్ చేసి మొత్తం కలెక్షన్‌ను 325 కోట్లు దాటించింది. ఆదివారం (హాలిడే ఫినిష్) కూడా సాలిడ్‌గా హోల్డ్ అయితే, ఫస్ట్ వీకెండ్ గ్రాస్ 400 కోట్ల దగ్గర క్లోజ్ అవుతోంది. మొదటి రోజు టాక్ బాగోలేకపోయినా, రజనీ పవర్ వర్కౌట్ అవుతున్నదని ట్రేడ్ సర్కిల్స్ అంటున్నాయి.

వార్ 2 ఎందుకింతా డౌన్?

ఇక బాలీవుడ్ యాక్షన్ మెగా ప్రాజెక్ట్ వార్ 2 మాత్రం రెవెన్యూ విషయంలో ఆందోళన కలిగిస్తోంది. నేషనల్ హాలిడే ఉన్నా మూడో రోజున భారీ డ్రాప్ వచ్చింది. ఎన్టీఆర్ లీడ్‌లో ఉన్నా తెలుగు వెర్షన్ ఎలాంటి ఇంపాక్ట్ చూపలేదు. హిందీ కలెక్షన్లు కూడా శనివారం గట్టిగా పడిపోయాయి. ట్రేడ్ అంచనాల ప్రకారం, మూడో రోజున కేవలం 53 కోట్లు మాత్రమే వచ్చి, మొత్తం కలెక్షన్ 215 కోట్లు దాటింది. సండేలో బిగ్ జంప్ రాకపోతే, వీకెండ్ క్లోజింగ్ పాజిటివ్ నోట్‌లో ఉండదు.

మండే టెస్ట్ క్రూషియల్!

రెండు సినిమాలు కూడా భారీ ప్రీ బిజినెస్ తో రిలీజ్ అయ్యాయి. ప్రస్తుతం సేఫ్. కానీ రియల్ టెస్ట్ మాత్రం మండే నుండి స్టార్ట్ అవుతుంది. వచ్చే వారం హోల్డ్ అవుతాయా? లేక ఒక్క వారం షో గా ఆగిపోతుందా? అన్నదే అసలు సస్పెన్స్!

బ్రో, నువ్వు ఏం అనుకుంటున్నావు? రజనీ ‘కూలీ’ సేఫ్ జోన్‌లోకి వెళ్తుందా? లేక వార్ 2 కమ్‌బ్యాక్ చేసి షాక్ ఇస్తుందా?

, , , , , , , , , ,
You may also like
Latest Posts from