

గత కొద్దికాలంగా తెలుగు ప్రేక్షకులకి ధనుష్ అంటే ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. అలాగే ఇక్కడో సెపరేట్ మార్కెట్ ఏర్పడింది. తమిళ స్టార్ అయినా, ఇక్కడ డబ్ సినిమాల ద్వారా కాకుండా డైరెక్ట్‌గా తెలుగు చిత్రాల్లో నటించడం ఆయనకి మరో లెవెల్‌కి తీసుకెళ్లింది. సార్ మంచి కమర్షియల్ సక్సెస్ అందుకోగా, తాజాగా వచ్చిన కుబేర కూడా బాక్సాఫీస్ వద్ద, విమర్శకుల వద్ద బాగా వర్కవుట్ అయింది. దీంతో ఆయనకు తెలుగు మార్కెట్‌లో మంచి బేస్ ఏర్పడింది.
ఇప్పుడేమో ధనుష్ తన మూడో తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడనే వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు వేణు ఊడుగుల తో ఆయన జట్టు కట్టబోతున్నాడని టాక్. నీదినాది ఒకే కథ , విరాట పర్వం వంటి సినిమాలతో తనదైన స్టైల్ చూపించిన వేణు, ఇప్పుడు ధనుష్‌తో కలవడం ఆసక్తికరంగా మారింది.
ఈ భారీ ప్రాజెక్ట్‌ను యూవీ క్రియేషన్స్ నిర్మించబోతోందని సమాచారం. చర్చలు ఇప్పటికే ఫైనల్ స్టేజ్‌కి చేరాయని, అధికారిక ప్రకటన త్వరలోనే వస్తుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశముందని బజ్.