
మారుతి నిజంగా ఎన్‌టీఆర్‌ను టార్గెట్ చేశాడా? క్షమాపణ ఎందుకు?
దర్శకుడు మారుతి చేసిన ఒక చిన్న వ్యాఖ్య పెద్ద దుమారమే రేపింది. ‘ద రాజా సాబ్’ నుండి విడుదలైన మొదటి పాట ‘రెబల్ సాబ్’ ఈవెంట్‌లో మారుతి, “కాలర్ ఎత్తే మాటలు చెప్పను… ప్రభాస్ కట్‌అవుట్‌కు అలాంటి మాటలు చిన్నవైపోతాయి” అని చెప్పిన వ్యాఖ్య చుట్టూ పెద్ద వివాదం మొదలైంది.
ఈ వ్యాఖ్యను చాలామంది నేరుగా ఎన్‌టీఆర్ మీద సెటైర్గా తీసుకున్నారు. ఎందుకంటే వార్ 2 రిలీజ్‌కి ముందు ఎన్‌టీఆర్ చేసిన ప్రసిద్ధ ‘కాలర్ రైజ్’ జెస్టర్ ఫ్లాఫ్ తర్వాత సోషల్ మీడియాలో ట్రోల్ టాపిక్‌గా మారిపోయింది. అదే నేపథ్యం వల్ల మారుతి వ్యాఖ్య వెంటనే ఎన్‌టీఆర్ అభిమానుల్లో కోపం రగిలించింది.
ఈ విమర్శలపై స్పందించిన మారుతి సోషల్ మీడియాలో బహిరంగ క్షమాపణ చెప్పారు.
అయన రాసినదేమంటే—
“ప్రతి అభిమానికి నిజాయితీగా క్షమాపణ చెబుతున్నాను. ఎవరి మనసు నొప్పించడం నా ఉద్దేశం కాదు. కొన్నిసార్లు మాటల ప్రవాహంలో కొన్ని మాటల ఉద్దేశ్యం తప్పుగా ముందుకు వెళ్తాయి. అంతే తప్ప పోల్చాలని ఆలోచనే లేదు.”
ఇక ఎన్‌టీఆర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ—
“ఎన్‌టీఆర్ గారిపై నాకు అపారమైన గౌరవం ఉంది. అభిమానుల ప్రేమ, సినిమా పట్ల ఉన్న వారి అభిమానం నాకు విలువైనవి. హృదయపూర్వకంగా ఈ క్లారిఫికేషన్ ఇస్తున్నాను… పరిస్థితిని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను” అని తెలిపారు.
ఇప్పటికే వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న మారుతికి ‘ద రాజా సాబ్’ చాలా క్రూషియల్ మూవీనైందన్న విషయం తెలిసిందే… ఈ క్షమాపణ డ్యామేజ్ కంట్రోలు అవుతుందా? అభిమానుల ప్రతిస్పందన ఏంటి? — ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్!
