ఈరోజు కింగ్ నాగార్జున పుట్టిన రోజు. కానీ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఊహించినంత హంగామా చేయటం లేదు. ఎందుకంటే వాళ్లు ఒక్కటే ఎక్స్పెక్ట్ చేశారు – నాగ్ వందో సినిమా అప్‌డేట్. అది రాకపోవడంతో ఫ్యాన్స్‌లో ఏదో మిస్సింగ్ ఫీలింగ్ నెలకొంది. దానికి కారణం సైమన్ పాత్రేనా?
నాగ్ రీసెంట్ గా చేసిన ‘కూలీ’లో సైమన్ పాత్ర గట్టి షాక్ ఇచ్చినట్టే అయింది. నాగ్ చాలా బలంగా నమ్ముకున్న ఆ రోల్… అనుకున్నంత పంచ్ ఇవ్వలేకపోయింది. సినిమా బావున్నా, కింగ్ పాత్ర ఫ్యాన్స్‌కి కిక్ ఇవ్వలేదు. దాంతో సోషల్ మీడియాలో “ఇలాంటి రోల్ ఎందుకు చేశాడు నాగ్?” అనే డిస్కషన్ మొదలైంది.
ఇక అదే కనుక కిక్ ఇచ్చి ఉంటే… ఈరోజు నాగ్ బర్త్‌డే అంటే వందో సినిమా అప్‌డేట్‌తో మోత మోగిపోయేది. కానీ సైమన్ ఎఫెక్ట్ వేరేలా పని చేసింది. ఫలితంగా నాగ్ సైలెంట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.
మరో వైపు, కార్తీక్ అనే తమిళ దర్శకుడు చెప్పిన కథకు నాగ్ ఓకే చెప్పేశాడని, గుప్‌చుప్‌గా పూజా కూడా జరిగిపోయిందని టాక్. బర్త్‌డే గిఫ్ట్‌గా గ్లింప్స్ కూడా రెడీ చేశారనే వార్తలు. కానీ అవి బయటకు రాలేదు.
ఇంతకీ సైమన్ దెబ్బకు కింగ్ సైలెంట్ అయ్యాడా? లేక సాయంత్రానికి ఫ్యాన్స్‌కి పెద్ద సర్ప్రైజ్ రెడీగా ఉంచాడా?