కూలీ సినిమా విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్‌ దగ్గర తుఫాన్ లాంటి వసూళ్లు కురుస్తున్నాయి. ఓపెనింగ్ వీకెండ్‌లోనే వార్ 2 కంటే 100 కోట్లు ఎక్కువ వసూళ్లు సాధించి, రజనీకాంత్ మాస్ హిస్టీరియా ఏ రేంజ్‌లో ఉందో చూపించింది. నాగార్జున స్టార్ పవర్‌, ఉపేంద్ర – ఆమిర్ ఖాన్ ప్రెజెన్స్ సినిమాకు భారీ బలం ఇచ్చాయి.

అయితే… సోషల్ మీడియాలో మాత్రం ఈ స్టార్‌ల గురించి అంతగా కాదు, వేరే ఒక నటుడి గురించే పెద్ద హడావిడి జరుగుతోంది.
అతడే – మలయాళీ టాలెంట్ సౌబిన్ షాహిర్.

“కూలీలో నిజమైన షో స్టీలర్ సౌబిన్‌నే” అంటూ నెటిజ‌న్లు అంటున్నారు.
మోనికా పాటలో పూజా హెగ్డేను కూడా వెనక్కి నెట్టేస్తూ అతను చేసిన ఎనర్జిటిక్ డ్యాన్స్ ఫుల్ వైరల్ అయ్యింది.
“రజనీ ఉన్నా, నాగ్ ఉన్నా… ఈ పాటలో హైలెట్ గా నిలిచింది మాత్రం సౌబిన్!” అంటూ సోషల్ మీడియాలో ఫ్రెంజీ.

సౌబిన్ 30 ఏళ్ల వయసులోనే నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రేమమ్, సుడానీ ఫ్రమ్ నైజీరియా సినిమాలతో నటుడిగా రేంజ్ పెంచుకున్నాడు. కుంబలంగి నైట్స్, మంజుమ్మల్ బాయ్స్తో కేరళను దాటి పాన్-ఇండియా లెవల్‌లో పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా మంజుమ్మల్ బాయ్స్ తో సౌబిన్ పేరు హౌస్‌హోల్డ్ నేమ్ అయిపోయింది.

తమిళంలో మాత్రం మొదటిసారి కూలీలో పూర్తి స్థాయి పాత్ర దక్కించుకుని, నాగార్జున అనుచరుడు ‘దయాల్’గా నటించాడు. ఆ పాత్రను చూసిన ప్రేక్షకులు “ఇది సెకండరీ రోల్ కాదు… సినిమాలోని సీక్రెట్ వెపన్” అని పిలుస్తున్నారు.

ఇక నెటిజన్లు మరింత ముందుకు వెళ్లి —

“ఈ పెర్ఫార్మెన్స్‌కి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ నేషనల్ అవార్డు రావాలి” అని కామెంట్లు చేస్తున్నారు.

అదే కాదు, త‌దుప‌రి తళ అజిత్ సినిమాలో కూడా అతనికి అవకాశం వచ్చిందని టాక్ మొదలైంది. ఆ వార్తపై అధికారిక కన్ఫర్మేషన్ రాకపోయినా, సౌబిన్ హైప్ మాత్రం కొత్త లెవల్‌లో ఉంది.

అసలు హైలెట్ ఏమిటంటే — రజనీ, నాగార్జున, ఆమిర్, ఉపేంద్ర లాంటి స్టార్ ఫ్లడ్ మధ్య, ప్రజల మాటల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు మాత్రం సౌబిన్ షాహిర్‌ దే కావటం.

, , , , , , ,
You may also like
Latest Posts from